అమెరికా, రష్యాలనే భయపెట్టే బాంబులు భారత్ వద్ద వున్నాయి... రహస్యంగా...
అణు రహిత బాంబులు తమకే సొంతం అన్నట్లు అమెరికా, రష్యాలు చెపుతుంటాయి. తమవద్ద వున్న బాంబులే అతిపెద్ద బాంబులని ప్రపంచ సమాజానికి తెలుపుతుంటాయి. అమెరికా ఈమధ్యనే ఆఫ్ఘనిస్తాన్ లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద స్థావరంపై మదర్ ఆఫ్ ఆల్ బాంబ్ అనే అణురహిత బాంబులను వదిలి 100 మ
అణు రహిత బాంబులు తమకే సొంతం అన్నట్లు అమెరికా, రష్యాలు చెపుతుంటాయి. తమవద్ద వున్న బాంబులే అతిపెద్ద బాంబులని ప్రపంచ సమాజానికి తెలుపుతుంటాయి. అమెరికా ఈమధ్యనే ఆఫ్ఘనిస్తాన్ లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద స్థావరంపై మదర్ ఆఫ్ ఆల్ బాంబ్ అనే అణురహిత బాంబులను వదిలి 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ బాంబులే అతిపెద్దవని అమెరికా గొప్పగా చెప్పుకుంటుంది. ఇలాంటివి తమవద్ద చాలా వున్నాయని రష్యా కూడా వంతపాడింది.
ఐతే ఈ రెండు దేశాలకు మించిన శక్తివంతమైన బాంబులు భారతదేశ ఖాతాలో వున్నాయి. సంప్రదాయ పేలుడు పదార్థాల కంటే 15 రెట్లు అధిక శక్తిమంతమైన 'సీఎల్-20' అనే పేరు గల బాంబు మన దేశం వద్ద వున్నది. ఐతే ఈ బాంబును ఎలా ప్రయోగిస్తారన్నది మాత్రం వెలికి రాలేదు.
స్పైస్ అని పిలుచుకునే స్మార్ట్ ప్రిసైజ్ ఇంపాక్ట్ అండ్ కాస్ట్ ఎఫెక్టీవ్ అనే పేరుగల మరో అతి శక్తిమంతమైన బాంబు కూడా భారతదేశం వద్ద వుంది. భారతదేశం అనుకుంటే ఇలాంటి శక్తివంతమైన బాంబులతో శత్రువులను చెండాడవచ్చు. భారతదేశం ఇప్పటికే అంతరిక్ష శోధనకు సంబంధించి ఉన్నత శిఖరాలను దాటుకుంటూ ముందుకెళుతోంది. ఇక రక్షణ రంగంలోనూ తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది.