Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతీయ పతాకాన్ని అవమానించిన చైనా అధికారి: తిరగబడ్డ ఉద్యోగులు

మన జాతీయ పతాకను అవమానించిన చైనా మొబైల్ కంపెనీ అధికారిపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేసిన 2 వేలమంది భారతీయ కార్మికులు అతగాడిపై కేసు బుక్ చేసేంతవరకు ఉత్పత్తి ఆపివేసిన ఘటన నొయిడాలో సంచలనం కలిగించింది. జరిగిన ఘటనపై చైనా మొబైల్ తయారీ సంస్థ ఒప్పో ఉన్నతాధికారులు

జాతీయ పతాకాన్ని అవమానించిన చైనా అధికారి: తిరగబడ్డ ఉద్యోగులు
హైదరాబాద్ , బుధవారం, 29 మార్చి 2017 (05:20 IST)
మన జాతీయ పతాకను అవమానించిన చైనా మొబైల్ కంపెనీ అధికారిపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేసిన 2 వేలమంది భారతీయ కార్మికులు అతగాడిపై కేసు బుక్ చేసేంతవరకు ఉత్పత్తి ఆపివేసిన ఘటన నొయిడాలో సంచలనం కలిగించింది. జరిగిన ఘటనపై చైనా మొబైల్ తయారీ సంస్థ ఒప్పో ఉన్నతాధికారులు విచారం వ్యక్తం చేసి క్షమాపణ అడిగారు.
 
నొయిడాలోని సెక్టర్ 63లో ఉన్న చైనీస్ మొబైల్ తయారీ యూనిట్‌లో సోమవారం రాత్రి జరిగిన ఘటన భారతీయ ఉద్యోగుల్లో ఆగ్రహాన్ని రగిలిచింది. కంపెనీకి చెందిన చైనా అధికారి సుహహు భారత జాతీయ పతాకం ఉన్న చిత్రాన్ని చించివేసి దాన్ని చెత్త కుండీలో పారేశాడు. దీంతో తీవ్ర నిరసన తెలిపిన కంపెనీ ఉద్యోగులు నేరుగా భారత జాతీయ పతాకాన్ని కంపెనీ ప్రవేశ ద్వారం వద్ద అతికించి సోమవారం అర్థరాత్రి నుంచి 8 గంటలపాటు సహాయ నిరాకరణ చేశారు. తర్వాత కంపెనీ గోడపై అనేక పోస్టర్లను అతికించడమే కాకుండా ఒప్పో ఆఫీసు వెలుపల ఉన్న రహదారిని బ్లాక్ చేశారు. 
 
మంగళవారం ఉదయం ఆరుగంటలకు విషయం తెలిసి ఏఎస్పీ గౌరవ్ గ్రోవర్, ఇతర పోలీసు అధికారులు ఘటనా స్థలికి చేరుకుని నిరసనకారులకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. కాని వారు ఆ చైనా అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేంతవరకు శాంతించలేదు. 
 
జరిగిన ఘటనను సుమిత్ ఉపాద్యాయ్ అనే ఉద్యోగి వివరించాడు. సోమవారం సాయంత్రం 3 గంటలప్పుడు యూనిట్‌ను తనిఖీ చేయడానికి వచ్చిన చైనా అధికారి భారత జాతీయ పతాకాన్ని కలిగిన పోస్టర్లను చూసి చింపివేసి చెత్తకుండీలో పడేశాడు. దీన్ని గమనించిన ఉద్యోగులు నిరసన తెలిపినా అతగాడు పట్టించుకోలేదు. ఈ వార్త రాత్రి షిఫ్టుకు వచ్చిన వారిలో దావానలంలా వ్యాపించింది. రాత్రి 8గంటలకు షిప్టు పని ప్రారంభమైంది సరిగ్గా అర్థరాత్రి వేళ ఉద్యోగులు భారత జాతీయ పతాకం పోస్టర్లను చాలావాటిని తెచ్చి ఒంటిగంటకు పని ఆపేసి యూనిట్ బయటకు నడిచారు.
 
ఉద్యోగుల రాతపూర్వక పిటిషన్‌ ఆధారంగా భారత జాతీయ పతాకాన్ని అవమానించిన చైనా అదికారిపై నోయిడా పోలీసులు ఎప్ఐఆర్ నమోదు చేసారు
 
ఈలోగా ఒప్పో నిర్వహణ అధికారులు కార్యాలయానికి చేరుకుని ఉద్యోగులతో మాట్లాడారు. తర్వాత కంపెనీ తరపున అదికారిక ప్రకటన విడుదల చేశారు. ఒప్పో ఇండియా లో ఉన్న మేం ఈ విషయాన్ని తీవ్రంగా భావిస్తున్నాం. ఈ దురదృష్టకర ఘటన పట్ల పశ్చాత్తాపం చెందుతున్నాం. సంబంధిత అధికారులకు పూర్తి సహకారం అందిస్తాము. బ్రాండ్ కంపెనీ అయిన ఒప్పో భారత్ పట్ల ఎనలేని గౌరవాన్ని కలిగి ఉంటోంద. భారత్‌లో మా కంపెనీలో 99 శాతం మంది భారతీయులే. దీన్ని బట్టి మేం స్థానికులకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో అర్థమవుతుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ ఎంపీ ఎన్నిసార్లు టికెట్ బుక్ చేస్తే అన్ని సార్లూ కేన్సిల్ చేయండి: ఎయిర్ ఇండియా ఆదేశం