Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ పరిస్థితుల్లో రాజీనామా చేస్తే బీజేపీకి అవకాశం ఇచ్చినట్టే : అరవింద్ కేజ్రీవాల్

kejriwal

ఠాగూర్

, శుక్రవారం, 24 మే 2024 (11:39 IST)
ప్రస్తుత పరిస్థితుల్లో తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే అది భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చినట్టేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. అందువల్ల తాను ఎట్టిపరిస్థితుల్లోనూ సీఎం పదవికి రాజీనామా చేయబోనని పునరుద్ఘాటించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఈ ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన తిరిగి తీహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలన్న షరతు విధించింది. 
 
ఈ నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వీటిపై ఆయన స్పందిస్తూ, తనకు అధికారం ముఖ్యం కాదన్నారు. మేం ప్రభుత్వంలో ఉన్నామా? లేక ప్రతిపక్షంలో ఉన్నామా? అనేది అనవసరమన్నారు. అది టైమ్ మాత్రమే నిర్ణయిస్తుందన్నారు. కానీ హామీలను పూర్తి చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. గతంలో ఆదాయపన్ను కమిషనర్ పదవిని వదులుకొని మురికివాడల్లో పని చేసినట్టు గుర్తుచేశారు. 
 
2013లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ 49 రోజుల్లోనే ఆ పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు. ఆనాడు ఎందుకు రాజీనామా చేశావు? అని ఎవరూ అడగలేదన్నారు. చిన్న ఉద్యోగాన్ని కూడా ఎవరూ వదులుకోరన్నారు. ప్రస్తుతం తాను ప్రజల కోసం పోరాడుతున్నానని... అందుకే రాజీనామా చేయడం లేదన్నారు. 
 
2015లో తమ పార్టీ 67 సీట్లు, 2020లో 62 సీట్లు గెలుచుకుందన్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో తమను ఓడించలేమని గుర్తించిన మోడీ... తనను అరెస్టు చేయించారని ఆరోపించారు. తప్పుడు కేసులతో తమ వారిని అరెస్టు చేశారని మండిపడ్డారు. తాను కనుక సీఎం పదవికి రాజీనామా చేస్తే మిగతా రాష్ట్రాల్లోని ప్రతిపక్ష ముఖ్యమంత్రులను కూడా అరెస్టు చేసే అవకాశం కేంద్రంలోని బీజేపీకి ఇచ్చినట్లే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ తర్వాత బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌లను అరెస్టు చేయవచ్చునని.. అందుకే రాజీనామా చేయనని తేల్చి చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలికపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం.. ఇంటి నుంచి బయటికి వచ్చిన..?