యోగా గురువు బాబా రాందేవ్ బాబా మహిళలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దుస్తుల్లేకున్నా మహిళలు బాగుంటారని బాబా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. మహారాష్ట్ర థానేలో పతంజలి యోగా పీఠం, ముంబై మహిళల పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో యోగా శిబిరం నిర్వహించారు.
యోగా శిబిరం ముగిశాక మహిళలకు చీరలు ధరించే సమయం దొరకలేదు. దీంతో వారి డ్రెస్సింగ్ సెన్స్‌పై రాందేవ్ బాబా షాకింగ్ కామెంట్స్ చేశారు. మహిళలు చీరలో బాగుంటారు.. సల్వార్ సూట్స్ వేసుకున్నా అందంగా వుంటారు. తన లాగా ఏం వేసుకోకున్నా బాగుంటారు.
తాము పదేళ్ల వరకు తాము బట్టలే వేసుకోలేదన్నారు. ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు ఫైర్ అవుతున్నాయి. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ ముందే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.