ఆక్యుపంక్చర్ విధానం ద్వారా ఇంట్లోనే ప్రసవానికి ప్రయత్నించిన ఓ గర్భిణి మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో జరిగింది. ఈ ఘటనలో 33 యేళ్ల మహిళ చనిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరువనంతపురానికి చెందిన 36 ఏళ్ల గర్భిణి షెమీరా బీవీ ఆక్యుపంక్చర్ వైద్యం ద్వారా బిడ్డకు జన్మనిచ్చేందుకు ప్రయత్నించింది. నొప్పులతో తీవ్ర రక్తస్రావమయ్యాక ఆస్పత్రిలో చేరగా తల్లీబిడ్డా ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. మృతురాలి భర్త నయాజ్‌ను అరెస్టు చేశారు. మంగళవారం జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. షెమీరా బీవీ కొన్నాళ్ల క్రితం నాలుగోసారి గర్భం దాల్చారు. తొమ్మిది నెలల కాలంలో ఒక్కసారి కూడా వైద్యుడిని సంప్రదించలేదు. భర్తతో కలిసి ఆక్యుపంక్చర్ నిపుణుడి వద్ద వైద్యం చేయించుకునేది.
వైద్యుడిని ఆమె సంప్రదించేందుకు నయాజ్ ఒప్పుకోలేదని, ఆశావర్కర్లను ఇంట్లోకి రానివ్వలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 'సాధారణ కాన్పు కోసమే నయాజ్ పట్టుబట్టి, దాని సంబంధిత వీడియోలు యూట్యూబ్‌లో చూసేవాడు. షెమీరాను ఇరుగుపొరుగువారితో మాట్లాడేందుకు సైతం అనుమతించేవాడు కాదు. ఇంట్లో ఒంటరిగా ఉండమని నిర్బంధించేవాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచే