Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్ళైనా... సమీప బంధువుతో రొమాన్స్.. భర్త అడ్డని భార్యే చంపేసింది..

వివాహేతర సంబంధంతో ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హతమార్చించింది. ఆపై ఏమీ తెలియనట్లు నటించింది. కానీ పోలీసులు అసలు నిజాలేంటో వెలుగులోకి తీశారు. ఈ నెల 31న పత్తికొండలో హత్యకు గురైన కృష్ణ కేసులో అతని భార్

Advertiesment
పెళ్ళైనా... సమీప బంధువుతో రొమాన్స్.. భర్త అడ్డని భార్యే చంపేసింది..
, సోమవారం, 7 ఆగస్టు 2017 (17:14 IST)
వివాహేతర సంబంధంతో ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హతమార్చించింది. ఆపై ఏమీ తెలియనట్లు నటించింది. కానీ పోలీసులు అసలు నిజాలేంటో వెలుగులోకి తీశారు. ఈ నెల 31న పత్తికొండలో హత్యకు గురైన కృష్ణ కేసులో అతని భార్యకు లింకునట్లు తేల్చారు. కృష్ణ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు. వివరాల్లోకి వెళితే.. పత్తికొండ పట్టణంలోని కుమ్మరివీధిలో భార్యతో కలిసి కృష్ణ కొన్నేళ్లుగా నివాసముంటోంది. 
 
కృష్ణకు సమీప బంధువైన అరుణ్ కుమార్ నంద్యాల ఎంబీఏ చదువుతూ వీరింటికి తరచూ వస్తూ వెళ్తుండేవాడు. ఈ క్రమంలో కృష్ణ భార్యతో అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో తమ అక్రమ సంబంధానికి అడ్డుగా వున్న కృష్ణను చంపేయాలని భార్య, అరుణ్ కలిసి ప్లాన్ వేశారు. 
 
ఈ క్రమంలో జులై 31 తెల్లవారు జామున కృష్ణ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో.. అతని భార్య నీలిమ, ప్రియుడు అరుణ్ కలిసి అతని గొంతు నులిమి హత్య చేశారు. ఈ విషయాన్ని పోలీసులు కనిపెట్టారు. ఇందుకు సంబంధించి కాల్ డేటా, వీడియో ఫుటేజీ ఆధారాలు కూడా సేకరించారు. నీలిమ, అరుణ్ లను అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కసాయి భర్త : ఉద్యోగం చేస్తోందనీ భార్య తల నరికేశాడు