Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మగబిడ్డ కావాలని సోదరుడితో గడపమన్నాడు.. అంతే భర్తను చంపేసింది.. ఎలాగంటే?

వారసత్వం కోసం మగ సంతానం కావాలంటూ భార్య పట్ల ఓ భర్త నీచంగా ప్రవర్తించాడు. ఇక భర్త వేధింపులు తాళలేక భర్తను భార్యే కడతేర్చిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..ఢిల్లీకి చెందిన ఓ దంపతులకు కుమ

Advertiesment
మగబిడ్డ కావాలని సోదరుడితో గడపమన్నాడు.. అంతే భర్తను చంపేసింది.. ఎలాగంటే?
, శనివారం, 25 మార్చి 2017 (18:04 IST)
వారసత్వం కోసం మగ సంతానం కావాలంటూ భార్య పట్ల ఓ భర్త నీచంగా ప్రవర్తించాడు. ఇక భర్త వేధింపులు తాళలేక భర్తను భార్యే కడతేర్చిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..ఢిల్లీకి చెందిన ఓ దంపతులకు కుమార్తె వుంది. కానీ తనకు మగబిడ్డ కావాలని భార్యను వేధించాడు. ఇందుకో తన సోదరుడితో గడపాల్సిందిగా తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. కానీ భార్య అందుకు అంగీకరించకపోవడంతో.. ఆమెను చిత్రహింసలు పెట్టాడు. 
 
ఆమెపై గ్యాంగ్‌ రేప్ జరిపిస్తానని, వేశ్యాగృహాలకు అమ్మేస్తానని బెదిరించాడు. ఇప్పటికే పుట్టబోయేది కుమార్తె అని తెలుసుకుని పలుసార్లు ఆమెకు అబార్షన్ కూడా చేయించాడు. చివరకు సహనం కోల్పోయిన మహిళ భర్తను చంపేయాలనుకుంది. భర్తకు ఇచ్చే పానీయంలో నిద్రమాత్రలు కలిపేసింది. బాగా నిద్రలోకి జారుకున్నాక ఊపిరాడకుండా చేసి చంపేసింది. 
 
ఈ హత్య తాను చేయలేదని ముందుగా చెప్తూ వచ్చిన మృతుడి భార్యను పోలీసులు అనుమానంతో విచారించడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఆమె నిందితురాలని తేల్చారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడీని అగౌరవపరచడం వల్లే.. నా భర్త దాడి చేయాల్సి వచ్చింది.. గైక్వాడ్ భార్య