Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పారిశ్రామికవేత్త భర్తను వీడి ఫేస్‌బుక్ ప్రియుడిని పెళ్లాడేందుకు వెళ్లిన వివాహిత

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ పరిచయాలు పలు సందర్భాల్లో మంచి చేస్తుంటే.. పలు సందర్భాల్లో విపరీత పరిణామాలకు దారితీస్తున్నాయి. అంతేనా.. పలువురు యువతీయువకులు చాటింగ్‌ల ద్వారా ప్రేమికులుగా మారి ఒక్కటైన సంఘటనలూ ఉన్నా

పారిశ్రామికవేత్త భర్తను వీడి ఫేస్‌బుక్ ప్రియుడిని పెళ్లాడేందుకు వెళ్లిన వివాహిత
, బుధవారం, 10 ఆగస్టు 2016 (17:23 IST)
ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ పరిచయాలు పలు సందర్భాల్లో మంచి చేస్తుంటే.. పలు సందర్భాల్లో విపరీత పరిణామాలకు దారితీస్తున్నాయి. అంతేనా.. పలువురు యువతీయువకులు చాటింగ్‌ల ద్వారా ప్రేమికులుగా మారి ఒక్కటైన సంఘటనలూ ఉన్నాయి. అలాగే, వివాహమైన దంపతులు.. తమ ఫేస్‌బుక్ ప్రియురాళ్లు/ప్రియుడి కోసం తమ భర్త/భార్యలను వదిలివేసి వెళ్లిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. ఇలాంటి సంఘటన ఒకటి మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
25 యేళ్ళ యువతికి యువతికి మూడేళ్ల క్రితం నాసిక్కు చెందిన ఓ పారిశ్రామికవేత్తతో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఆ తర్వాత ఫేస్బుక్ ద్వారా ఆమెకు ఇటీవల ఉత్తరాఖండ్లోని లోహఘాట్కు చెందిన యువకుడు పరిచయమయ్యాడు. అతను ఢిల్లీలోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
గత నెల 10న వివాహిత (25) తన భర్తను వదలి ప్రియుడి దగ్గరకు పారిపోయింది. ఆమె వెళ్తూ ఇంట్లో నుంచి నగలు, డబ్బు తీసుకెళ్లింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేశారు. ఉత్తరాఖండ్లోని చంపావత్లో ప్రేమజంట ఉన్నట్టు గుర్తించారు. నాసిక్ పోలీసులు చంపావత్ వెళ్లి వివాహితను గుర్తించి వెనక్కు తీసుకునివచ్చారు. కానీ ప్రియుడు మాత్రం పరారయ్యాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న్యూయార్క్‌లో దారుణం : గూగుల్ మేనేజర్‌ను రేప్‌ చేసి హత్య చేశారు