Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్తకు వివాహేతర సంబంధం.. రోడ్డుపై చెప్పుతో కొట్టిన భార్య.. భర్త పరుగో పరుగు..

భర్త ఇతర మహిళతో సంబంధం పెట్టుకుంటావా అంటూ చేతులో చెప్పుతో రోడ్లపై భర్తను పరుగులు పెట్టించింది. వివరాల్లోకి వెళితే.. గ్వాలియర్‌కు చెందిన పుష్ప, మనీశ్ అగర్వాల్ ప్రేమించుకున్నారు. పోలీసులు, కోర్టును ఆశ్ర

Advertiesment
భర్తకు వివాహేతర సంబంధం.. రోడ్డుపై చెప్పుతో కొట్టిన భార్య.. భర్త పరుగో పరుగు..
, శనివారం, 11 ఫిబ్రవరి 2017 (18:07 IST)
భర్త ఇతర మహిళతో సంబంధం పెట్టుకుంటావా అంటూ చేతులో చెప్పుతో రోడ్లపై భర్తను పరుగులు పెట్టించింది. వివరాల్లోకి వెళితే.. గ్వాలియర్‌కు చెందిన పుష్ప, మనీశ్ అగర్వాల్ ప్రేమించుకున్నారు. పోలీసులు, కోర్టును ఆశ్రయించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లు అన్యోన్యంగా ఈ జంట కలిసి ఉన్నారు. కొన్ని నెలలుగా మనీశ్ వ్యవహారం పుష్ప ఆశించినట్లుగా ఉండట్లేదు. రెండు నెలలుగా మనీశ్ వ్యవహారాన్ని గమనించిన భార్యకు అనుమానం వచ్చింది. 
 
భర్త మనీశ్‌కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని తెలుసుకుంది.. ఇక లాభం లేదనుకున్నఆమె.. తన బంధువుల సాయంతో మనీశ్‌ను పట్టుకుని.. ఈ విషయంపై కడిగి పారేసింది. మనీశ్ రోడ్లపై పరుగు అందుకోగానే చెప్పు చేతపట్టిన పుష్ప కూడా భర్తను తరుముతూ హల్ చల్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. 
 
ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. చిన్నపిల్లల్లా వ్యవహరించవద్దని ఇంటికి వెళ్లి హాయిగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇదే అవకాశమని భావించిన మనీశ్, పుష్ప నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మ బతికుంటే ఇదంతా జరిగేనా? శశికళకే నా సపోర్ట్.. విజయశాంతి