Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్య స్నేహితురాలికి కూల్‌డ్రింక్స్‌లో మత్తు కలిపి రేప్.. ఆపై బ్లాక్ మెయిలింగ్...

వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యాపారవేత్త.. తన భార్య స్నేహితురాలికి లైన్ వేసి.... భార్యకు తెలియకుండానే ఆమెపై అత్యాచారం చేశాడు. పార్టీకి రావాలంటూ ఇంటికి ఆహ్వానించి.. కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు

Advertiesment
భార్య స్నేహితురాలికి కూల్‌డ్రింక్స్‌లో మత్తు కలిపి రేప్.. ఆపై బ్లాక్ మెయిలింగ్...
, శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (09:22 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యాపారవేత్త.. తన భార్య స్నేహితురాలికి లైన్ వేసి.... భార్యకు తెలియకుండానే ఆమెపై అత్యాచారం చేశాడు. పార్టీకి రావాలంటూ ఇంటికి ఆహ్వానించి.. కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి ఆపై యేడాది పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ యేడాదిలో రెండుసార్లు అబార్షన్ కూడా చేయించాడు. అయితే, ఆ వ్యాపారవేత్త వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆ కామాంధుడి బండారం బయటపడటంతో జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఒడిషాకు చెందిన ఓ 30 యేళ్ల పెళ్లికాని మహిళ ఉన్నత చదువుల కోసం కోల్‌కతాకు వచ్చింది. తన స్నేహితురాళ్లతో కలిసి జోధ్‌పూర్‌ గార్డెన్స్‌లో ఓ ఫంక్షన్‌కు వెళ్లింది. అక్కడ తన స్నేహితుడి ద్వారా కోల్‌కతాకు చెందిన వ్యాపారవేత్త రాకేష్ చౌదరి దంపతులకు పరిచయమైంది. ఆ తర్వాత రాకేష్ భార్య, ఆ మహిళ మంచి స్నేహితులుగా మారారు. ఈ క్రమంలో పెళ్లికాని మహిళపై కన్నేసిన రాకేష్.. తన భార్య లేని రోజున ఆ మహిళను ఇంటికి ఆహ్వానించాడు. 
 
ఇంటికి వచ్చిన ఆమెకు మత్తుమందు కలిపిన కూల్‌‌డ్రింక్స్‌ ఇచ్చాడు. ఆ తర్వాత బాధితురాలిని కోల్‌కతాలోని బైపాస్‌ రోడ్డులో ఉన్న తన గెస్ట్‌హౌజ్‌కి తీసుకెళ్లాడు. పూర్తిగా మద్యం తాగించి స్పృహకోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ క్రమంలో ఫొటోలు, వీడియోలు తీశాడు. తర్వాత తాను పిలిచిన ప్రతిసారి రాకుంటే ఫొటోలు బయటపెడతానని బెదరించి ఏడాదిపాటు దుర్మార్గానికి పాల్పడ్డాడు. రెండుసార్లు గర్భస్రావం చేయించాడు. ఆ తర్వాత కూడా అతడు వేధింపుల స్థాయి పెంచడంతో భరించలేని బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెను వైద్య పరీక్షలకు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీడీపీ నేతలపై రోజా ఘాటు వ్యాఖ్యలు.. లోకేష్ ఒక పప్పు.. అయ్యన్న ఎర్రిపప్పు