Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళ పట్ల జమ్మూ పోలీసుల వేధింపులు.. జననాంగంలో బీరుబాటిల్ పెట్టి.. మిర్చి పౌడర్ పోశారు..

ఉగ్రవాదులను ఏమీ చేయలేని జమ్మూకాశ్మీర్ పోలీసులు పని మనిషిపై వీరంగం సృష్టించారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా జమ్మూ పోలీసులు ప్రవర్తించారు. ఉగ్రవాదులను ఏమీ చేయలేని జమ్మూపోలీసులు ఒక ఇంట్లో పని మ

మహిళ పట్ల జమ్మూ పోలీసుల వేధింపులు.. జననాంగంలో బీరుబాటిల్ పెట్టి.. మిర్చి పౌడర్ పోశారు..
, గురువారం, 11 మే 2017 (10:00 IST)
ఉగ్రవాదులను ఏమీ చేయలేని జమ్మూకాశ్మీర్ పోలీసులు పని మనిషిపై వీరంగం సృష్టించారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా జమ్మూ పోలీసులు ప్రవర్తించారు. ఉగ్రవాదులను ఏమీ చేయలేని జమ్మూపోలీసులు ఒక ఇంట్లో పని మనిషిగా పనిచేసే మహిళపై తమ ప్రతాపం చూపారు. థర్డ్ డిగ్రీ కంటే దారుణమైన హింసా పద్ధతులను వినియోగించారని బాధిత వివాహిత (28) బోరున విలపించింది. తన జననాంగంలో బీరుబాటిల్ పెట్టి, మిర్చి పౌడర్ పోశారని కన్నీరు మున్నీరైంది. 
 
వివరాల్లోకి వెళితే.. జమ్మూ పట్టణంలోని దోమనా ప్రాంతంలోని ఓ ఇంట్లో పనిమనిషిగా ఉంటున్న బాధిత మహిళ ఇటీవల పని మానేసింది. ఈ నేపథ్యంలో ఆ ఇంటి యజమాని ఏప్రిల్ 30న నగలు చోరీ చేసిందని ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నాలుగు రోజుల క్రితం కెనాల్ రోడ్డులోని పోలీసుస్టేషనుకు ఆమెను తీసుకొచ్చిన జమ్మూ పోలీసులు ఆమెకు నరకం చూపించారు. 
 
తాను నేరం చేయలేదని, తాను పని మానేయడం వల్లే యజమాని తప్పుడు కేసుపెట్టాడని ఎంత మొత్తుకున్నా పోలీసులు వినిపించుకోలేదు. ఈ ఘటనపై కోర్టును ఆశ్రయించడంతో ఆమె చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని.. కోర్టు ఆదేశాలు జారీచేసింది. దీనిపై న్యాయ విచారణ కూడా జరుగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తితిదే ఈవో నియామకంపై అలా అన్నాడా? లేదే? పవన్ వ్యాఖ్యలపై జనసేన వివరణ