కారులో మహిళపై గ్యాంగ్ రేప్.. నోట్లో గుడ్డలు కుక్కి 3 గంటల పాటు...?
కారులో మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. ముంబయిలోని అంబోలిలో భర్త పక్కన ఉండగానే 28ఏళ్ల మహిళపై అతి కిరాతకంగా సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఇంకా మ
కారులో మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. ముంబయిలోని అంబోలిలో భర్త పక్కన ఉండగానే 28ఏళ్ల మహిళపై అతి కిరాతకంగా సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఇంకా మరువకముందే తాజాగా మరో దారుణ ఘటన వెలుగుచూసింది.
కదులుతున్న కారులో ఓ దళిత మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దళిత మహిళ రైల్వేస్టేషన్‌కు వెళ్లేందుకు రోడ్డుపై నిల్చుండగా.. ఆమె ఎదురుగా వచ్చి ఓ కారు ఆగింది. తామూ స్టేషన్‌కే వెళ్తున్నామని చెప్పి ఆమెను ఎక్కించుకున్నారు. అలా మార్గమధ్యంలో ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు.
ఆమె అరుపులు కేకలు ఎవ్వరికి వినిపించకుండా నోట్లో గుడ్డలు కుక్కి మూడు గంటలపాటు కారులోనే నిర్బంధించి అనంతరం మహిళను రాత్రి 8గంటల సమయంలో దహమన్ గ్రామంలో వదిలిపెట్టి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.