Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైద్యులు చనిపోయిందన్నారు.. ఐతే చితిమంటపైనే ఆమె ప్రాణాలు పోయాయి... ఎలా?

ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో 21 ఏళ్ల యువతి ఆస్పత్రిలో చేరింది. అంతే వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బతికున్నప్పటికీ.. ఆమె చనిపోయిందని.. రిపోర్ట్ ఇచ్చేశారు. మృతదేహాన్ని తీసుకెళ్లమన్నారు. ఇక చేసేది ల

వైద్యులు చనిపోయిందన్నారు.. ఐతే చితిమంటపైనే ఆమె ప్రాణాలు పోయాయి... ఎలా?
, బుధవారం, 1 మార్చి 2017 (15:34 IST)
ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో 21 ఏళ్ల యువతి ఆస్పత్రిలో చేరింది. అంతే వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బతికున్నప్పటికీ.. ఆమె చనిపోయిందని.. రిపోర్ట్ ఇచ్చేశారు. మృతదేహాన్ని తీసుకెళ్లమన్నారు. ఇక చేసేది లేక సదరు యువతిని ఇంటికి తీసుకొచ్చి.. దహన కార్యక్రమాలు చేపట్టారు. ఆ చితిలో ఆమె ప్రాణాలు విడిచింది. ఈ ఘటన యూపీలోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో 21 ఏళ్ల యువతి మరణించినట్లు శ్రద్ధా ఆస్పత్రి వైద్యులు ఆదివారం నిర్ధారించారు. సోమవారం తెల్లవారుజామున 1.27 గంటలకు ఆమె భర్తకు మృతదేహం అప్పగించారు. ఆయన స్నేహితులతో కలిసి కారులో భార్య మృతదేహాన్ని అలీగఢ్‌ జిల్లాకు తీసుకెళ్లి ఉదయం 8 గంటలకు దహనక్రియలు నిర్వహించాడు.
 
మహిళ సోదరుడికి ఆమె మృతి పట్ల అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా దహనక్రియలు జరుగుతున్న ప్రదేశానికి వచ్చారు. కానీ అప్పటికే ఆమె శరీరం 70 శాతం కాలిపోయింది. అయినా ఆమె శరీరాన్ని పోలీసులు శవపరీక్షకు పంపారు. పరీక్షించిన వైద్యులు ఆమె మృతికి కారణం చితిమంటేలేనని తేల్చేశారు. ఆమె ప్రాణాలతోనే ఉన్నదని...  అందుకే ఊపిరితిత్తుల్లోకి, శ్వాసనాళాల్లోకి మసి కణాలు చేరాయని, ప్రాణం లేకపోతే అవి లోపలికి వెళ్లవని పేర్కొన్నారు. డీఎన్‌ఏ పరీక్ష కోసం వైద్యులు ఎముకను భద్రపరిచారు. 
 
ఇదిలా ఉంటే.. తన మేనకోడలిపై అత్యాచారం, హత్య చేశారంటూ మృతురాలి మేనమామ, ఆమె భర్తతో పాటు పది మంది కుటుంబ సభ్యులపై  కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుర్‌మెహర్‌ కౌర్‌కు మద్దతిచ్చేవారంతా పాకిస్థానీయులే.. మోడీ ఫోటోలను చెప్పులతో కొట్టాలి..