దేశంలో కరోనా వ్యాక్సిన్ అన్ని వర్గాల వారికి చేరువకావడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. టీకా తీసుకోవాలంటే కొవిన్‌లో రిజిస్ట్రర్ అవ్వాల్సి ఉంటుంది.
కానీ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజలు, అదేవిధంగా పేదలకు డిజిటల్ వసతులు లేక సాధ్యం కావడం లేదని గురువారం ఆయన ట్వీట్ చేశారు. టీకా వేయించుకోవాలంటే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కచ్చితం కాకూడదు.
వ్యాక్సినేషన్ కేంద్రానికి వచ్చిన ప్రతీ వ్యక్తి టీకా పొందాలి. ఇంటర్నెట్ ద్వారా కొవిన్‌లో రిజిస్ట్రర్ కానీ వ్యక్తికి కూడా టీకా తీసుకునే హక్కుంది. అని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదలు... స్మార్ట్ ఫోన్, డిజిటల్ వసతులు లేనివారు టీకా పొందేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. ఇంటర్నెట్ వసతులు లేని వారు కొవిన్‌లో రిజిస్ట్రర్ కాలేరు కనుక వారికి మినహాయింపులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.