Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆర్మీ రిలీఫ్ ఫండ్‌కు ప్రతి నిర్మాత రూ.5 కోట్లు ఇవ్వాలి : రాజ్‌ ఠాక్రే డిమాండ్

వివాదాలే ఊపిరిగా చేసుకుని మనుగడ సాగిస్తున్న మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధినేత రాజ్‌ఠాక్రే. ఈయన కనీవినీ ఎరుగని డిమాం‌డ్‌ను తెరపైకి తెచ్చారు. పాకిస్థాన్ నటీనటులతో సినిమాలు తీసే ప్రతి నిర్మాత భా

ఆర్మీ రిలీఫ్ ఫండ్‌కు ప్రతి నిర్మాత రూ.5 కోట్లు ఇవ్వాలి : రాజ్‌ ఠాక్రే డిమాండ్
, శనివారం, 22 అక్టోబరు 2016 (13:23 IST)
వివాదాలే ఊపిరిగా చేసుకుని మనుగడ సాగిస్తున్న మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధినేత రాజ్‌ఠాక్రే. ఈయన కనీవినీ ఎరుగని డిమాం‌డ్‌ను తెరపైకి తెచ్చారు. పాకిస్థాన్ నటీనటులతో సినిమాలు తీసే ప్రతి నిర్మాత భారత సైనిక సహాయ నిధి (ఆర్మీ రిలీఫ్ ఫండ్) రూ.ఐదు కోట్లు ఇవ్వాలంటూ షరతు విధించారు. 
 
దర్శకనిర్మాత కరణ్ జోహార్ తాజా చిత్రం 'ఏ దిల్ హై ముష్కిల్'. ఈచిత్రంలో విడుదలపై వివాదం నెలకొంది. దీంతో ఈ చిత్ర పంచాయతీ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ వద్దకు చేరింది. ఇందులో కరణ్ జోహార్‌లతో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ఇతర సినిమా పెద్దలు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం రాజ్‌ఠాక్రే మీడియాతో మాట్లాడారు. 
 
పాకిస్థానీ నటులతో సినిమాలు తీసిన ప్రతి ఒక్క నిర్మాత రూ.5 కోట్లను సైనిక సహాయ నిధి(ఆర్మీ రిలీఫ్ ఫండ్)కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని నిర్మాతలందరూ తప్పక అంగీకరించాలని, రూ.5 కోట్లు ఇచ్చేందుకు నోటిమాటగా కాకుండా రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని ఆయన అన్నారు. 
 
అంతేకాదు, భారతీయ నిర్మాతలెవ్వరూ పాకిస్థానీ నటీనటులను సినిమాల్లోకి తీసుకోవద్దని, ఒకవేళ అలా చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని ఠాక్రే హెచ్చరించారు. యురీ ఉగ్రదాడి తర్వాత పాక్ నటులపై నిషేధం విధించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన ఎంఎన్ఎస్.. పలు నిర్మాతల మండళ్లు, ఎగ్జిబిటర్ల మద్దతుసైతం కూడగట్టిన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బావ ఎలక్ట్రికల్ సైకిల్ తొక్కితే... బావమరిది బుల్లెట్ నడిపాడు... ఎవరా బావాబావమరుదులు?