Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రజలు ఘోరంగా అవమానించారు... రాజకీయాలకు గుడ్‌బై : ఇరోమ్ షర్మిల ఆవేదన

మణిపూర్ వాసులు తనను ఘోరంగా అవమానించారని, అందువల్ల రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్టు ఆ రాష్ట్ర ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. మణిపూర్‌లో ఎన్నో ఏళ్లుగా కొన‌సాగుతోన్న‌ సాయుధ దళాల ప్రత్యేక అ

Advertiesment
Manipur Election Results
, ఆదివారం, 12 మార్చి 2017 (08:28 IST)
మణిపూర్ వాసులు తనను ఘోరంగా అవమానించారని, అందువల్ల రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్టు ఆ రాష్ట్ర ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. మణిపూర్‌లో ఎన్నో ఏళ్లుగా కొన‌సాగుతోన్న‌ సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం రద్దు కోరుతూ 16 ఏళ్ల పాటు ఆమె నిరాహారదీక్ష చేసిన విషయం తెల్సిందే. 
 
ఈ దీక్షను ఇటీవలే విరమించారు. అనంతరం రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. ఇందుకోసం ఆమె పీఆర్‌జేఏ అనే పార్టీని స్థాపించారు. పీఆర్‌జేఏ పార్టీ తరపునే మణిపూర్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత ఇబోబి సింగ్‌పై పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. 
 
దీంతో రాజకీయపరంగా తనకు ప్రజల ఆదరణ లేదని గుర్తించిన రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.  అయితే ఆవిడకు కేవలం 90 ఓట్లే వచ్చాయి. దీంతో తీవ్ర నిరాశకు గురైన షర్మిల ప్రజలు తమకు మద్దతు చేయడం లేదని ఆవేదన చెందింది. మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్కటంటే ఒక్కటి నిరూపించండి.. 5 నిమిషాల్లో రాజీనామా.. కేసీఆర్ సవాల్