వైవాహిక జీవితంలో చాలా మంది మహిళలకు వంట చేయడం రాదు. అలాగని వాళ్లకు భర్తలో విడాకులు మంజూరు చేయడం ఏమాత్రం సబబు కాదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. భార్యకు వంట చేయడం రాకపోతే.. క్రూరత్వంగా పరిగణించలేమని వ్యాఖ్యానించింది.
భార్యకు రుచికరంగా వంట చేయడం రాదని కోర్టుకెక్కిన భర్త వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం ఏకపక్షంగా విడాకుల నిర్ణయం తీసుకోదని స్పష్టం చేసింది. భార్యకు వంట, వార్పు రాదనే సాకుతో ఆమెను వదిలించుకోవాలని.. శాశ్వతంగా విడిపోవాలని నిర్ణయించుకున్న ఓ భర్తకు కేరళ హైకోర్టు ఈ సంచలన తీర్పునిచ్చింది.
కేరళలోని అయంతోల్‌కి చెందిన ఓ వ్యక్తి తన భార్యతో 2012లో వివాహం జరిగింది. కానీ ఆమెకు వంటరాదనే కారణంగా అయంతోల్ విడాకులు తీసుకోవాలనుకున్నాడు. కానీ కేరళ కోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది.