అక్రమ సంబంధం.. కంటిచూపు మందగించిన భర్తను చంపేసిన భార్య!
అక్రమ సంబంధానికి తన కంటిచూపు మందగించిన భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య అతనని హతమార్చించింది. ఈ ఘటన తమిళనాడు, కోయంబత్తూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోవై ఇరుగూరు జయశ్రీ నగర్‌కు చెందిన శ
అక్రమ సంబంధానికి తన కంటిచూపు మందగించిన భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య అతనని హతమార్చించింది. ఈ ఘటన తమిళనాడు, కోయంబత్తూరులో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కోవై ఇరుగూరు జయశ్రీ నగర్‌కు చెందిన శక్తివేల్ (37). శక్తివేల్ భార్య పేరు శారద. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలున్నారు. భార్యాభర్తల మధ్య తరచూ విబేధాలు రావడంతో పాటు శక్తివేల్‌కు కంటిచూపు మందగించడంతో శారద అతనిని పట్టించుకోదట.
ఈ నేపథ్యంలో శారద.. రామ్ కుమార్ అనే వ్యక్తితో కలిసి పెట్స్ షాప్ నిర్వహిస్తోంది. దీంతో ఇద్దరి స్నేహం అక్రమసంబంధంగా మారిపోయింది. దీంతో రామ్ కుమార్‌తో కలిసి జీవించాలనుకున్న శారద శక్తివేల్‌ను.. చంపించింది. ఇందుకు రామ్ కుమార్ కూడా సహకరించాడు.
అయితే ఏమీ తెలియనట్లుగా మరుసటి రోజు తన భర్త కనబడట్లేదని శారద పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో శారదనే భర్తను చంపించిందని.. ఈ హత్యకు కారణమైన శారదను అరెస్ట చేసి.. పరారీలో ఉన్న రామ్ కుమార్ కోసం గాలిస్తున్నారు.