Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మానవత్వాన్ని చంపేసిన కండక్టర్... బస్సులో చనిపోయిన మహిళ.. వర్షం పడుతున్నా కిందికి తోసేశాడు

మొన్న ఒడిషాలో ఆస్పత్రిలో చనిపోయిన భార్య మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఆంబులెన్స్ నిరాకరించడంతో భార్య శవాన్ని భుజాన వేసుకుని 10 కిలోమీటర్ల మేరకు నడిచిన భర్త. ఈ ఘటన మరువకముందే రైలు

మానవత్వాన్ని చంపేసిన కండక్టర్... బస్సులో చనిపోయిన మహిళ.. వర్షం పడుతున్నా కిందికి తోసేశాడు
, ఆదివారం, 28 ఆగస్టు 2016 (12:38 IST)
మొన్న ఒడిషాలో ఆస్పత్రిలో చనిపోయిన భార్య మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఆంబులెన్స్ నిరాకరించడంతో భార్య శవాన్ని భుజాన వేసుకుని 10 కిలోమీటర్ల మేరకు నడిచిన భర్త. ఈ ఘటన మరువకముందే రైలు ప్రమాదంలో చనిపోయిన ఓ వృద్ధురాలి మృతదేహాన్ని శవపంచనామాకు తరలించేందుకు చేతులు, కాళ్లు విరిచి.. ఓ గుడ్డలోమూటగట్టిన రైలు సిబ్బంది. ఈ రెండు ఘటనలు దేశంలో సంచలనం సృష్టించాయి. వీటిని మరువక ముందే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో అవమానవీయ ఘటన జరిగింది. 
 
అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య మార్గ మధ్యలోనే చనిపోవడంతో చంటిబిడ్డ, ఓ పెద్దావిడ ఉందనే జాలి కూడా లేకుండా వారి కుటుంబాన్ని అర్థాంతరంగా బస్సులో నుంచి దింపేశాడో బస్సు కండక్టర్. అటవీ ప్రాంతంలో జోరు వర్షం పడుతుందనే జాలి కూడా వారిపట్ల చూపించకుండా, మానవత్వాన్ని చంపేసి.. రూపానికే మనుషులుగా జీవించివున్నామని నిరూపించాడు ఆ కండక్టర్. 
 
దీంతో చిన్నబోయిన ముఖంతో కంటి నిండా నీరుతో రెండు చేతులపై చంటి బిడ్డను వేసుకొని రోడ్డుపక్కన భార్య మృతదేహాన్ని ఉంచి తన ముసలితల్లితో కలిసి వచ్చిపోయే వాహనాల వైపు ఆ వ్యక్తి దీనంగా చూడసాగాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఇద్దరు న్యాయవాదులు వారికి సాయపడి.. ట్యాక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దామో జిల్లాలో జరిగింది. ఆ వ్యక్తి పేరు రామ్ సింగ్ లోధి. ఈయన భార్య మల్లి భాయి అనారోగ్యానికి గురికావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకునేందుకు తన ఐదురోజులపాప, తల్లి సునియా బాయ్‌తో కలిసి బస్సులో బయలుదేరారు.
 
అయితే, మార్గం మధ్యలో ఉండగానే సింగ్ భార్య సునియా చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న బస్సు కండక్టర్ వారిని అర్థాంతరంగా దింపేశాడు. అలా అర్థగంటపాటు వర్షంలోనే దామోకు 20 కిలో మీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో రోడ్డుపక్కన కూర్చున్నారు. అదేసమయంలో మృత్యుంజయ్ హజారీ, రాజేశ్ పాటిల్ అనే ఇద్దరు న్యాయవాదులు అటువైపుగా వెళుతూ వారికి సహాయం చేశారు. పోలీసులకు ఫోన్ చేయగా వారు కేవలం వివరాలు మాత్రమే నమోదుచేసుకొని వెళ్లిపోగా లాయర్లు మాత్రం వారికి ఒక ట్యాక్సీ ఏర్పాటుచేశారు. అనంతరం ఈ విషయం బయటకు రావడంతో ప్రైవేట్ బస్సును సీజ్ చేసి.. డ్రైవర్, కండక్టర్‌ను అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడేళ్ళ బాలుడికి మద్యం తాగించిన వైనం... ఇద్దరి అరెస్టు