Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నటి ఖుష్బూ కళ్ళలో ఆనందం.. ఎందుకు?

Advertiesment
నటి ఖుష్బూ కళ్ళలో ఆనందం.. ఎందుకు?
, మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (17:34 IST)
సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నటి ఖుష్బూ. ప్రస్తుతం అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అధికార ప్రతినిధిగా ఉన్నారు. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈమె తొలుత డీఎంకేలో చేరి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు.
 
ఇదిలావుంటే, మరో రెండు మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో కొత్త పొత్తులు పొడుస్తుంటాయి. పాత మిత్రులు విడిపోతే.. కొత్త మిత్రులు వచ్చి చేరుతుంటారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎంకే కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే, బీజేపీ - అన్నాడీఎంకేలు పోటీ చేయొచ్చు.
 
అయితే, ఈ పొత్తులు ఇంకా ఖరారు కాలేదు. కానీ ఖుష్బూ మాత్రం తెగ సంబరపడిపోతున్నారు. ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన ఒక సర్వేలో డీఎంకే - కాంగ్రెస్ కూటమి రాష్ట్రంలోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలలో 36 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది. 
 
ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రజలు ఎన్నుకోలేదని, ఆయనను బలవంతంగా రుద్దారని ఆరోపించారు. అదేవిధంగా అన్నాడీఎంకే అనే పార్టీకి మూడు స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు సర్వేలు చెప్పాయని ఆమె గుర్తుచేశారు. 
 
ఈ పార్టీలతో నోటా కంటే తక్కువ ఓట్లు సాధించుకున్న రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిన బీజేపీ చేతులు కలుపుతుందని జోస్యం చెప్పారు. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే అంతకన్నా ఆనందం ఏముంటుందని ఆమె వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూత్ర విసర్జన కోసం బస్సు ఆపలేదనీ ఆ మహిళ ఎంత పని చేసిందో తెలుసా?