Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోర్టులకు తాళాలేయండి... జడ్జీల నియామకంలో జాప్యంపై టీఎస్.ఠాకూర్ ఆగ్రహం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్‌కు కోపమొచ్చింది. కోర్టులకు తాళాలు వేయాలని సలహా ఇచ్చారు. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న న్యాయమూర్తులు పోస్టుల నియామకంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని

Advertiesment
Chief Justice T S Thakur
, శనివారం, 29 అక్టోబరు 2016 (09:48 IST)
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్‌కు కోపమొచ్చింది. కోర్టులకు తాళాలు వేయాలని సలహా ఇచ్చారు. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న న్యాయమూర్తులు పోస్టుల నియామకంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆయన తూర్పూరబట్టారు. న్యాయవ్యవస్థను స్తంభింపజేయాలని కేంద్రంలో ఉన్న పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని, కోర్టులకు తాళాలు వేసి న్యాయవ్యవస్థను నడిరోడ్డుపై నిలబెట్టాలనుకున్నట్లుందని ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ తీవ్ర స్వరంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
ఠాకూర్‌ ఆగ్రహాంతో ఊగిపోవడాన్ని చూసిన లాయర్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. శుక్రవారం ఠాకూర్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం న్యాయమూర్తుల నియామకంలో జాప్యంపై విచారణ జరిపింది. కొలీజియం సిఫార్సు చేసిన జాబితాలో చాలామంది పేర్లు ఖరారు చేశామని, న్యాయ నియామకాల ప్రక్రియ అవగాహాన పత్రం(ఎంవోపీ) ఇంకా తయారు కానందునే మిగతా వారి పేర్లను రాష్ట్రపతికి పంపడంలో జాప్యమైందని అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ ఇచ్చిన సమాధానంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. 
 
కొలీజియం గతంలో సిఫార్సు చేసిన 88 మంది పేర్లలో 35 మందికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని మిగతా వారి పేర్లను కూడా త్వరలోనే ఆమోదిస్తామని ముకుల్‌ రోహత్గీ తెలిపారు. అప్పుడు జోక్యం చేసుకున్న చీఫ్‌ జస్జిస్‌ టిఎస్‌ ఠాకూర్‌ 'అలహాబాద్‌ హైకోర్టులో నిజానికి 165 మంది జడ్జీలు ఉండాలి. కేవలం 77 మందే నియమితులయ్యారు. 
 
కర్నాటక హైకోర్టులో ఒక ఫ్లోర్‌లో ఉన్న కోర్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. అక్కడ 68 మంది జడ్జీలకు గాను కేవలం సగం మందే ఉన్నారు. గతంలో జడ్జీలు ఉంటే కోర్టు హాలులు ఉండేవి కావు. ఇప్పుడు కోర్టు హాలులు ఉంటే జడ్జీలు లేని పరిస్థితి తలెత్తింది. ఒకపని చేయండి. మొత్తం కోర్టులన్నింటికీ తాళాలు వేసి న్యాయవ్యవస్థ లేదని చెప్పేయండి' అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ద్రవ ఇంధనం చల్లి ఆస్ట్రేలియాలో భారత డ్రైవర్‌ సజీవ దహనం