కుంభమేళా సమయంలో పూసలు అమ్ముకుంటూ కెమేరా కంటికి చిక్కి వైరల్ అయిన అమ్మాయి మోనాలిసా సోషల్ మీడియాలో ఇప్పటికీ పాపులర్. వెండితెర ఆఫర్ కొట్టేసిన ఈ అమ్మాయి ప్రతిరోజూ తన రీల్స్‌ను పంచుకుంటూనే ఉంటుంది. మోనాలిసా పంచుకునే రీల్స్ చూస్తూ ఆమెకి అభిమానులుగా మారేవారు క్రమంగా పెరుగుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే... ఏం జరిగిందో ఏమోగానీ మోనాలిసా ఏడుస్తూ కనిపించింది. ఆమె విపరీతంగా ఏడుస్తున్నట్లు కనిపించే వీడియో వైరల్ అవుతోంది. ఆమె వెంట కుటుంబ సభ్యులు కూడా వున్నారు.
వైరల్ వీడియోలో మోనాలిసా మొదట ఒక గదిలో కూర్చుని ఎవరితోనో మాట్లాడుతూ కనిపిస్తుంది. తర్వాత ఆమె ఇంటి నుండి బయటకు రాగానే ఏడవడం ప్రారంభిస్తుంది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్ళు ఆగినట్లు లేవు. మోనాలిసా ఈ వీడియోపై నెటిజన్లు తలోరకంగా వ్యాఖ్యానిస్తున్నారు.
తనతో సినిమా తీస్తానన్న డైరెక్టర్ అత్యాచారం కేసులో ఇరుక్కోవడంతో మోనాలిసా సినీ ఆశలు గల్లంతయ్యాయని ఏడుస్తున్నట్లుందని ఒకరు వ్యాఖ్యానించారు. మరికొందరైతే... మళ్లీ పూసలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందేమోనని బాధపడుతోందని కామెంట్లు చేస్తున్నారు.