Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాక్‌తో యుద్ధం చేయాల్సి వస్తే.. అది దేశం కోసమే కానీ.. ఓట్ల కోసం కాదు.. మోడీతో మాట్లాడుతా

యూరి ఘ‌ట‌న త‌ర్వాత పాకిస్థాన్‌పై యుద్ధం ప్ర‌క‌టించాల‌ని ప‌లు పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. శివసేన కూడా స్పందించింది. పాకిస్థాన్‌తో యుద్ధం చేయాల్సి వస్తే.. అది దేశం కోసమే చేయాలి కానీ, ఓట్ల కోస

పాక్‌తో యుద్ధం చేయాల్సి వస్తే.. అది దేశం కోసమే కానీ.. ఓట్ల కోసం కాదు.. మోడీతో మాట్లాడుతా
, బుధవారం, 21 సెప్టెంబరు 2016 (19:44 IST)
యూరి ఘ‌ట‌న త‌ర్వాత పాకిస్థాన్‌పై యుద్ధం ప్ర‌క‌టించాల‌ని ప‌లు పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. శివసేన కూడా స్పందించింది. పాకిస్థాన్‌తో యుద్ధం చేయాల్సి వస్తే.. అది దేశం కోసమే చేయాలి కానీ, ఓట్ల కోసం కాదని శివ‌సేన పార్టీ చీఫ్ ఉద్ద‌వ్ థాక్రే అన్నారు. పాకిస్థాన్ అంశంపై త్వరలో ప్రధాని మోడీతో మాట్లాడనున్నట్లు ఆయన చెప్పారు.
 
జమ్ముకాశ్మీర్ యూరీ సెక్టార్‌లోని ఆర్మీ స్థావరంపై ఉగ్రదాడి ఘటనపై రక్షణమంత్రి మనోహర్ పారికర్ స్పందించారు. ఉగ్రదాడి సూత్రధారులను వదిలిపెట్టబోమన్న ప్రధాని వ్యాఖ్యలను ఉత్తి ప్రకటనగా మారనీయమని పారికర్ చెప్పారు. తప్పులు జరిగే వుంటాయని.. ఇలాంటి తప్పుల్ని పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తాను మాట్లాడకం కన్నా ఆచరణకే ప్రాధాన్యతనిస్తానని చెప్పారు.
 
యూరీ ఘటన నేపథ్యంలో కశ్మీర్ వేర్పాటువాదులకు చెంపపెట్టులాంటి ఘటన చోటుచేసుకుంది. జులై 8న జరిగిన హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వాని ఎన్‌కౌంటర్‌ నాటి నుంచి జమ్మూకశ్మీర్ అల్లర్లతో అట్టుగుతోంది. కశ్మీర్ వేర్పాటువాదులు ముస్లిం యువతను రెచ్చగొట్టి, డబ్బుతో ప్రలోభపెట్టి సెక్యూరిటీ సిబ్బందిపై రాళ్ళ దాడులకు ఉసి గొల్పుతున్నారు. ఆర్మీ సెలక్షన్‌కు వచ్చిన ఓ అభ్యర్థి ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 89 మంది మృతి చెందగా సుమారు 11,500 మంది గాయపడ్డారు. కశ్మీర్‌లో రెండు నెలలకుపైగా కొనసాగుతున్న బంద్ నేపథ్యంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. 
 
ఈ నేపథ్యంలో వేర్పాటు వాదుల పిలుపును లెక్క చేయని ముస్లిం యువకులు ఆర్మీ సెలక్షన్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బుధవారం అనంతనాగ్ జిల్లాలో జరిగిన ఆర్మీ టెస్ట్‌కు భారీగా హాజరయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యురి ఘటన.. పాక్ టెర్రరిస్టులు పిరికిపందలు.. ఐకామ్ హ్యాండ్‌సెట్ కూడా పాకిస్థాన్‌దే