Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాక్‌లో మోసపోయి.. భారత్‌లో అడుగెట్టిన ఉజ్మా.. స్వాగతం పలికిన సుష్మా.. నరకంలో నుంచి?

పాకిస్థాన్‌లో మోసపోయిన భారత యువతి ఉజ్మా.. ఎన్నో పోరాటాలకు అనంతరం గురువారం భారత్‌లో అడుగుపెట్టింది. పాకిస్థాన్ అధికారులు, భారత్ హై కమిషన్‌కు చెంది అధికారులు ఆమెకు తోడుగా వచ్చారు. వాఘా సరిహద్దు దాటి ఉజ్

Advertiesment
Welcome Home
, గురువారం, 25 మే 2017 (17:44 IST)
పాకిస్థాన్‌లో మోసపోయిన భారత యువతి ఉజ్మా.. ఎన్నో పోరాటాలకు అనంతరం గురువారం భారత్‌లో అడుగుపెట్టింది. పాకిస్థాన్ అధికారులు, భారత్ హై కమిషన్‌కు చెంది అధికారులు ఆమెకు తోడుగా వచ్చారు. వాఘా సరిహద్దు దాటి ఉజ్మా భారత్‌లోకి ప్రవేశించింది.

ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైన ఉజ్మా.. భారత మాతకు వందనం చేసింది. ఆపై తనకు ఏర్పడిన పరిస్థితులను గురించి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌తో సంయుక్తంగా జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించింది.  
 
మే నెల ప్రారంభంలో ఇస్లామాబాద్ వెళ్లిన ఉజ్మాను తాహిర్ అనే వ్యక్తి తుపాకీతో బెదిరించి వివాహం చేసుకున్నాడు. ఆపై ట్రావెలింగ్ పేపర్లు తీసుకెళ్లి అక్కడే ఉండిపోయేలా ప్లాన్ చేసుకున్నాడు. ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. వీరిద్దరికి అంతకుముందే మలేషియాలో పరిచయం ఉండటంతో తాహిర్ బలవంతంగా ఉజ్మాను లొంగదీసుకుని పెళ్లి చేసుకున్నాడు.

వారంలోనే నరకంగా చూపించడంతో ఆమె నేరుగా భారత్‌ హైకమిషన్‌కు వెళ్లి సాయం కోరింది. ఆపై ఇస్లామాబాద్‌ హైకోర్టు కూడా ఉజ్మా భారత్‌ వెళ్లేందుకు అనుమతించడంలాంటివి చకచకా జరిగిపోవడంతో ఆమె తిరిగి ఊపిరి పీల్చుకుంది. 
webdunia
 
ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉజ్మా మాట్లాడుతూ, భావోద్వేగానికి గురైంది. దాదాపు తనకు నరకంలోకి వెళ్ళొచ్చినట్లుందని తన చేదు అనుభవాన్ని వెల్లగక్కింది.

ఈ గడ్డుపరిస్థితి నుంచి తనకు విముక్తి లభించేందుకు సహకరించిన ఇండో-పాక్ అధికారులకు, కోర్టు, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ.. ఉజ్మాకు జరిగిన అన్యాయానికి సారీ చెప్పారు. ఆపై ఉజ్మాను ఆమె బంధువులకు అప్పగించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ విధంగా వేసుకుంది... ఉద్యోగం ఊడగొట్టుకుంది... చలపతిరావులా కామెంట్ కొట్టింది...