Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ సింధునే పంజాబ్‌కు తీసుకొస్తాం.. పాకిస్తాన్‌కు అడిగే హక్కు లేదన్న మోదీ

పంజాబ్ రైతులు నీటి సమస్యపై ఇకనుంచి ఏమాత్రం ఆందోళన చెందవలసిన పనిలేదని, సింధు నది నుంచి నీటిని పంజాబ్‌కు మళ్ళించాలని తాము నిర్ణయించామని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. పాకిస్తాన్‌కు సింధు జలాలపై ఎలాంటి హక్కూ లేకున్నా ప్రస్తుతం సింధు నది పాకిస్తాన్‌

Advertiesment
ఆ సింధునే పంజాబ్‌కు తీసుకొస్తాం.. పాకిస్తాన్‌కు అడిగే హక్కు లేదన్న మోదీ
హైదరాబాద్ , శనివారం, 28 జనవరి 2017 (02:04 IST)
పంజాబ్ రైతులు నీటి సమస్యపై ఇకనుంచి ఏమాత్రం ఆందోళన చెందవలసిన పనిలేదని, సింధు నది నుంచి నీటిని పంజాబ్‌కు మళ్ళించాలని తాము నిర్ణయించామని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. పాకిస్తాన్‌కు సింధు జలాలపై ఎలాంటి హక్కూ లేకున్నా ప్రస్తుతం సింధు నది పాకిస్తాన్‌లోనే ప్రవహిస్తోందని ఇకనుంచి వాటిని పంజాబ్ రైతులకు అందిస్తామని చెప్పారు. వాస్తవానికి సింధు జలాలను పొందే హక్కు పంజాబ్ రైతులకే ఉందన్నారు. ఇంతవరకు పంజాబ్ రైతులు, భారత రైతులు ఇండియాలోని నదుల నుంచే నీటిని పొందేవారని, పాకిస్తాన్‌కు వెళుతున్న సింధు జలాలను పంజాబ్‌కే మళ్లిస్తామని మోదీ పంజాబ్ రైతులకు పూర్త భరోసా కల్పించారు.
 
అయిదు రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పంజాబ్‌లో ఎన్నికల సభలో ప్రసంగించిన మోదీ పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్‌ను ఆకాశానికెత్తేశారు. పంజాబ్‌లో ఖలిస్తాన్ తీవ్రవాదుల చర్యలు ప్రబలమైన కాలంలో ప్రకాశ్ సింగ్ బాదల్ వారికి పూర్తి మద్దతు నిచ్చారని అమెరికా గూఢచార సంస్థ సీఐఎ  ఆధారాలు చూపుతున్నప్పటికీ పట్టించుకోని మోదీ సిక్కు, హిందూ ప్రజల మధ్య ఐక్యతకే బాదల్ అహర్నిశలు శ్రమించారని కొనియాడారు.
 
హిందువులు, సిక్కుల మధ్య ఎప్పుడు ఉద్రిక్తతలు నెలకొన్నా, ఇతరులు రాజకీయాలు జరిపినా, పంజాబ్‌లో రాత్రింబవళ్లు హిందువులు, సిక్కుల మధ్య ఐక్యతకోసం రాత్రింబవళ్లు పనిచేసిన వారు బాదల్ సాబ్ మాత్రమేనని  మోదీ ప్రశంసించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనసేనా...? ఆ పార్టీ పేరు నేనెప్పుడూ వినలేదే...? జయసుధ ఆశ్చర్యం