Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎందుకు? తేనె తుట్టె కదిలించిన ములాయం కోడలు

వెనుబడిన జాబితాలోని యాదవ కులానికి చెందినప్పటికీ తన కూతురికి రిజర్వేషన్ అవసరం లేదని ఒక వెబ్ సైటుకు ఇచ్చిన ఇంటర్య్యూలో చెప్పిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ ఎన్నికల తొలిదశ పోలింగుకు ముందు పెద్ద బాంబు పేల్చారు. కుల

Advertiesment
కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎందుకు?  తేనె తుట్టె కదిలించిన ములాయం కోడలు
హైదరాబాద్ , బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (00:30 IST)
వెనుబడిన జాబితాలోని యాదవ కులానికి చెందినప్పటికీ తన కూతురికి రిజర్వేషన్ అవసరం లేదని ఒక వెబ్ సైటుకు ఇచ్చిన ఇంటర్య్యూలో చెప్పిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ ఎన్నికల తొలిదశ పోలింగుకు ముందు పెద్ద బాంబు పేల్చారు. కులం తర్వాతే అన్నీ పుట్టుకొచ్చే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మొదటి దశ ఎన్నికల పోలింగ్‌కు ముందు సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ చిన్న కోడలు అపర్ణ యాదవ్‌ తన వ్యాఖ్యలతో కలకలం రేపారు. 
 
కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లకు తాను వ్యతిరేకమని  వ్యాఖ్యానించడం ద్వారా అపర్ణా యాదవ్ యూపీ రాజకీయాల్లో తేనెతుట్టెను కదిలించారు.  ‘మేము బాగా కలిగిన కుటుంబానికి చెందినవాళ్లం. అలాంటప్పుడు కులాల ప్రతిపదికన రిజర్వేష్లన్లు ఎందుకు తీసుకోవాల’ని ఆమె సంధించిన ప్రశ్నతో యూపీ రాజకీయాలను వేడి పుట్టించాయి. 
 
ములాయం చిన్న కోడలు చేసిన ఈ ప్రకటన వెనువెంటనే బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఓబీసీలు, నిమ్నకులాలపై నిజంగా సమాజ్ వాదీ పార్టీకి ప్రేమ ఉంటే ఆమెపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. అపర్ణ యాదవ్ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి ఉమాభారతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యాదవ కులంలో ఎంతో మంది వెనుకబడినవారు ఉన్నారని తెలిపారు. 
 
తొలిసారి ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడిన అపర్ణ యాదవ్‌.. లక్నో కంటోన్మెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. వెనుకబడిన కులాల్లోనూ సంపన్నులుగా మారిన వారికి కులం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎందుకు అన్న ప్రశ్న వాస్తవానికి చాలా న్యాయమైన ప్రశ్న. క్రీమీలేయర్‌కు రిజర్వేషన్లు తీసివేయాలని దశాబ్దాలుగా దేశంలో జరుగుతున్న చర్చకు  ములాయం చిన్న కోడలు ప్రకటన ఒక రకంగా నైతిక సమర్థన ఇచ్చింది. 
 
కానీ దీన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్న పార్టీల కోవలో బీజేపీ ముందుపీఠిన నిలబడటం దిగ్భ్రాంతి కలిగిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బద్దలైన మౌనం.. అన్నాడీఎంకేను నిలువునా చీల్చేసిన పన్నీర్ సెల్వం