అన్నాడీఎంకే నేత దారుణ హత్య.. కత్తితో పొడిచి చంపేశారు.. రాజకీయ కారణాలు కాదట
తమిళనాట చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో పట్టపగలు నడిరోడ్డు పైన అన్నాడీఎంకే పార్టీ నాయకుడిని హత్య చేశారు. సహచరులతో ఆస్తి వివాదాలే హత్యకు కారణమని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. హత్యకు గురైన వ
తమిళనాట చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో పట్టపగలు నడిరోడ్డు పైన అన్నాడీఎంకే పార్టీ నాయకుడిని హత్య చేశారు. సహచరులతో ఆస్తి వివాదాలే హత్యకు కారణమని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. హత్యకు గురైన వ్యక్తి కనగరాజ్ (40).. అన్నాడీఎంకే పార్టీ తిరువన్నామలై నగర నాయకుడు. అతను కొద్ది నెలల క్రితం వరకు టౌన్ సెక్రటరీగా పనిచేశాడు.
ఆదివారం ఉదయం రోడ్డుపై వెళ్తుండగా ఆయుధాలతో వచ్చిన ముగ్గురు అతనిని హతమార్చారు. ఈ దాడికి రూ.3 కోట్ల లావాదేవీలు కారణమని గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. ఇందులో రాజకీయ కారణాలు లేవని పోలీసులు తెలిపారు. కాపు కాసి ముగ్గురు కారులో వచ్చి కత్తితో పొడిచి ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. కనగరాజ్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు.
కాగా, హత్య చేసిన వారు ప్రతిపక్ష డీఎంకే మద్దతుదారులుగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఆయన మృతి పట్ల అన్నాడీఎంకే అధినేత్రి శశికళ ప్రగాడ సానుభూతి తెలిపారు.