Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూపీలో టీ వ్యాపారులుగా మారిన.. మాంసం విక్రయదారులు.. నమాజ్-సూర్యనమస్కారం రెండూ ఒక్కటే

ప్రధాని నరేంద్రమోదీ యోగాను అంతర్జాతీయం చేసేందుకు కృషి చేస్తున్నందుకు యోగి ప్రశంసించారు. ఇంకా యోగి మాట్లాడుతూ.. ముస్లింలు ఆచరించే నమాజ్, హిందువులు చేసే సూర్యనమస్కారాలు రెండింటికీ చాలా దగ్గర పోలికలు ఉన్

యూపీలో టీ వ్యాపారులుగా మారిన.. మాంసం విక్రయదారులు.. నమాజ్-సూర్యనమస్కారం రెండూ ఒక్కటే
, గురువారం, 30 మార్చి 2017 (12:13 IST)
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ పతంజలి యోగి మిషన్, ఇతర సంస్థలు ఏర్పాటు చేసిన యోగ్ మహాత్సవ్-2017లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు వెల్లడించారు. యూపీలో బీజేపీ గెలిచిన తర్వాత సీఎంగా ఎవరిని నియమించాలని చర్చించిన తర్వాత అధిష్ఠానం ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందు త‌న‌కు ఫోన్ చేసింద‌ని చెప్పారు.

త‌మ పార్టీ జాతీయాధ్య‌క్షుడు అమిత్‌షా ఫోన్‌లో త‌న‌తో ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయాలని త‌న‌తో చెప్పారన్నారు. ఆ ఫోన్ రావడంతో గందరగోళంలో పడిపోయానని.. ఆపై అమిత్ షా ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానన్నారు. యూపీ త‌న‌కు చాలా బాగా తెలుసని, తాను రాష్ట్రం నుంచి పార్లమెంటు వరకూ ప్రయాణించానని చెప్పారు. 
 
ఆలయాలు, మఠాల్లో భిక్ష కూడా తీసుకునేవాడినని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై త‌న‌కు పూర్తి అవగాహన ఉందని, ప్రధాని మోడీ స్ఫూర్తిగా యూపీని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలో ఉన్నవాళ్లు భోగాల కోసం అలమటించారే తప్ప యోగా గురించి ఆలోచించలేదని విమర్శించారు. కులమతాల పేరుతో దేశాన్ని విడగొట్టాలని భావిస్తున్న వారికి యోగా గురించి పట్టదన్నారు. 2014కు ముందు యోగా గురించి మాట్లాడిన వారికి మతం రంగు పులిమేవారని అన్నారు. 
 
ప్రధాని నరేంద్రమోదీ యోగాను అంతర్జాతీయం చేసేందుకు కృషి చేస్తున్నందుకు యోగి ప్రశంసించారు. ఇంకా యోగి మాట్లాడుతూ.. ముస్లింలు ఆచరించే నమాజ్, హిందువులు చేసే సూర్యనమస్కారాలు రెండింటికీ చాలా దగ్గర పోలికలు ఉన్నాయని తెలిపారు. ఈ రెండూ ఒకటేనని యోగి తెలిపారు. సూర్యనమస్కారాల్లో భాగంగా వేసే ఆసనాలు, ముద్రలు.. నమాజ్ సమయంలో ముస్లింలు చేసినట్టుగానే ఉంటాయని పేర్కొన్నారు. తద్వారా యోగాకు, హిందూమతానికి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారు.
 
ఇదిలా ఉంటే.. క‌బేళాలే ఆధారంగా డ‌బ్బు సంపాదించిన యూపీ వ్యాపారులు ప్రస్తుతం ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను వెతుక్కుంటున్నారు. ముజఫర్‌నగర్‌లో ప‌లువురు మాంస విక్రయదారులు టీ వ్యాపారులుగా మారారు. అయితే, తాజాగా మీడియాతో మాట్లాడుతూ... తాము నిర్వహించిన మాంసం దుకాణాలకు లైసెన్సులున్నాయ‌ని అయిన‌ప్ప‌టికీ వాటిని మూసివేయించార‌ని వాపోయారు. ఇక తాము ఏమీ చేయ‌లేక టీ కొట్లు పెట్టుకున్నామ‌ని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు తెలుసు.. ఏపీలో అగ్రిగోల్డ్‌కు 14వేల ఎకరాల భూమి వుంది: పవన్ కల్యాణ్