కార్డియో వర్కవుట్స్, జెమ్స్, ఆఖరికి రన్నింగ్ కంటే వాకిం బెస్ట్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా వచ్చిన ఓ సర్వే నడకతోనే అసలైన ఆరోగ్యమని తేల్చి చెప్పింది. మరికొందరు గుండె సమస్యలు రాకుండా ఉండటానికి కార్డియో వ్యాయామాలు చేస్తుంటారు.
వ్యాయామశాలలకు వెళుతుంటారు. కిలోమీటర్ల కొద్దీ పరుగు తీస్తుంటారు. అయితే ఇవన్నీ చేయటం వల్ల తెలీకుండానే ఒత్తిడిని పెరుగుతుందని, అందువల్ల రన్నింగ్ కంటే వాకింగ్ ఎంతో మేలని వారు అంటున్నారు. ఆరోగ్యంగా ఉంటాలంటే నడక లేదా బ్రిస్క్ వాకింగ్ చేయటం వల్ల ఒత్తిడి మరింత తగ్గుతుందని ఈ పరిశోధనలో తేలింది.
ఈ సర్వేలో మొత్తం 33 వేల మంది రన్నింగ్ చేసేవారిని, 15 వేల మంది వాకర్స్ డేటాను అధ్యయనం చేశారు. రన్నింగ్ చేసే వారికంటే వాకింగ్ చేసేవారికి గుండె సమస్య తక్కువగా ఉందని తేలింది. రన్నింగ్ చేయటం వల్ల రక్తపోటు 4.2 శాతం తగ్గితే, వాకింగ్ చేయటం వల్ల బ్లడ్ ప్రెషర్ 7.2 శాతం తగ్గిందని తేలింది.
ఇలా వాకింగ్ చేయటం వల్ల మోకాళ్ల నొప్పులు, వెన్నునొప్పి అదుపులో ఉంటుంది. దీంతోపాటు బరువు కూడా తగ్గుతారు. మొత్తానికి వాకింగ్ పది నిముషాలు చేసి రిలాక్స్ తీసుకున్నాక.. వేగాన్ని పెంచి మరో ఇరవై నిముషాలు చేశాక కాస్త విశ్రాంతి తీసుకో వాలి. ఈ పద్ధతి వల్ల ఎంతో ఉపయోగం ఉందని నిపుణులు అంటున్నారు.