Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పైసా మే హై పరమాత్మ... ఉగ్రవాదికి ఓటర్ ఐడీ... ఆధార్

Advertiesment
పైసా మే హై పరమాత్మ... ఉగ్రవాదికి ఓటర్ ఐడీ... ఆధార్
, సోమవారం, 5 అక్టోబరు 2015 (08:50 IST)
భారత దేశంలో లంచం ఇస్తే ఏదైనా జరిగిపోతుంది. ఎవరికైనా గుర్తింపు లభిస్తుందనడంలో అనుమానం లేదు. మన అధికారులు మరోమారు రుజువు చేసుకున్నారు. అయితే ఏకంగా ఉగ్రవాదులకే ఓటరు ఐడీలను, ఆధార్ కార్డులను కూడా ఇచ్చేస్తారని ఊహించి ఉండరు కదు. అది కూడా జరిగిపోయింది. బంగ్లాదేశ్కు చెందిన తారిఖుల్ ఇస్లాం అనే ఉగ్రవాది భారత్లో ఆధార్ కార్డుతోపాటు, ఎన్నికల గుర్తింపు కార్డు కూడా పొందాడు. నట్లు అధికార వర్గాల సమాచారం. 
 
తారఖుల్ ఇస్లాం అనే ఉగ్రవాదికి బుర్ద్వాన్ పేలుళ్లలతో సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. గతవారం జార్ఖండ్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఇతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తనకు ఆ నేరానికి ఎలాంటి సంబంధం లేదని బుకాయించారు. అయితే చివరకు దిమ్మ తిరిగే అంశాలను వెల్లడించారు. భారీ మొత్తంలో లంచం ఇచ్చి ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డులను పొందినట్లు వెల్లడించారు. దీంతో అధికారులు షాక్ తిన్నారు. 
 
బంగ్లాదేశ్కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్తో తారిఖ్కు ప్రత్యక్ష సంబంధాలున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. అతని నుంచి మరింత సమాచారం రాబడుతున్నట్లు తెలుస్తోంది. 
 

Share this Story:

Follow Webdunia telugu