Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖలో ప్రేమజంట వికృత చేష్టలు.. వీడియో వైరల్

Advertiesment
lovers
, శుక్రవారం, 30 డిశెంబరు 2022 (10:39 IST)
విశాఖపట్టణంలో ఓ ప్రేమజంట వికృత చేష్టలు శృతిమించి పోయాయి. వీరి చేష్టలను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో స్థానిక పోలీసులు స్పందించారు. 
 
ఓ యువకుడు మరో యువతిని తన ద్విచక్ర వాహనం ఇంధన ట్యాంకుపై అపసవ్య దిశలో కూర్చోబెట్టుకుని, ఆమెకు ముద్దులు పెడుతూ, పట్టపగలే రయ్ రయ్ మంటూ విశాఖ రోడ్లపై చక్కర్లు కొట్టాడు. ఆ యువతి స్కూల్ యూనిఫాం ధరించి వుండటం గమనార్హం. 
 
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధాన రహదారిపై కనిపించిన ఈ దృశ్యాన్ని సరిగ్గా ఆ సమయంలో కారులో వెళుతున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అది వైరల్ అయింది. ఆ వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ జంట కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
 
ఇందులో గాజువాక సమీప వెంపలి నగర్, సమతానగర్‌కు చెందిన యువతీయువకులుగా గుర్తించి అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వీరిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కారు ప్రమాదం.. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన రిషబ్ పంత్