Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కావేరీ ఇష్యూ: పనికిమాలిన రాజకీయాలు.. కోయంబేడులో విజయ్ కాంత్ నిరాహార దీక్ష.. అమ్మ ఏం చేస్తుందో..?

కావేరీ ఇష్యూపై ఇరు రాష్ట్రాల మధ్య అగ్గి రాజుకున్న నేపథ్యంలో పనికిమాలిన రాజకీయాలు చేసేందుకు డీఎండీకే లీడర్, తమిళ హీరో విజయ్‌కాంత్‌ సిద్ధమయ్యారు. కావేరీ జలాలకు సంబంధించి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు భగ్

Advertiesment
కావేరీ ఇష్యూ: పనికిమాలిన రాజకీయాలు.. కోయంబేడులో విజయ్ కాంత్ నిరాహార దీక్ష.. అమ్మ ఏం చేస్తుందో..?
, బుధవారం, 14 సెప్టెంబరు 2016 (11:00 IST)
కావేరీ ఇష్యూపై ఇరు రాష్ట్రాల మధ్య అగ్గి రాజుకున్న నేపథ్యంలో పనికిమాలిన రాజకీయాలు చేసేందుకు డీఎండీకే లీడర్, తమిళ హీరో విజయ్‌కాంత్‌ సిద్ధమయ్యారు. కావేరీ జలాలకు సంబంధించి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. బెంగళూరు కెంగేరిలోని ద్వారకనాథ్‌ నగర వద్ద ఒకే ఆవరణలో నిలిపి ఉంచిన తమిళనాడు ప్రైవేటు రవాణా సంస్థ కేపీఎన్‌కు చెందిన 30, మరో సంస్థకు చెందిన 2 బస్సుల్ని దుండగులు తగులబెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 38 లారీలను ధ్వంసం చేశారు. 
 
బెంగళూరులో ఆందోళనకారులపై భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా ఇద్దరికి బుల్లెట్‌ గాయాలయ్యాయి. మరోవైపు తమిళనాడులో రాజధాని చెన్నైలోని ఓ స్టార్ హోటల్‌పై కర్ణాటక తీరుకు నిరసనగా ఆందోళనకారులు పెట్రోలు బాంబుతో దాడి చేశారు. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ఈ ఇష్యూను విజయ్ కాంత్ వివాదం చేయాలనుకుంటున్నారు. 
 
ఈ వివాదంపై విజయ్‌కాంత్‌ నిరాహార దీక్షకు దిగనున్నారు. ఈ దాడి ఘటనను తీవ్రంగా ఖండిచిన ఆయన దీక్షలో కూర్చుంటారట. గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాయి ఉనికిని కోల్పోయిన ఆయన ఇప్పుడీ వివాదాన్ని రాజకీయం చేసి క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. 
 
ఇంకా విజయకాంత్ దీక్ష చేయడానికి కోయంబేడు ప్రాంతాన్ని ఎంచుకోవడం కూడా చాలా చాలా వ్యూహాత్మకంమేనని భావించవచ్చు. అక్కడే చెన్నై ప్రధాన బస్ కాంప్లెక్ ఉంది. అక్కడికి నిత్యం ఆంధ్రా, కర్నాటక, కేరళ వంటి ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి వందలాది ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు వచ్చి వెళుతుంటాయి. కనుక పరిస్థితి ఏ మాత్రం అదుపు తప్పినా ఊహించనంతగా నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉంది.
 
రాజకీయాలలో ఉన్న వ్యక్తులు ఇటువంటి ఆలోచనలు చేయడం చాలా దురదృష్టకరమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పైగా ఆయన సినిమాలలో గొప్ప పనులు చేస్తున్నట్లు నటిస్తూ నిజజీవితంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం కెప్టెన్ విజయకాంత్‌కే చెల్లుతుంది. తమిళనాడు ప్రభుత్వం ఆయన దీక్షకి అనుమతిస్తే సమస్య ఇంకా జటిలం అయ్యే ప్రమాదం ఉంది కనుక ముందుగానే ఆయనని అడ్డుకోవడం మంచిదని ప్రజలు, స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది... జనజీవనం అస్తవ్యస్తం