వైకాపా మాజీ నేత విజయ సాయి రెడ్డి శనివారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. అధికారిక స్పీకర్ ఫార్మాట్‌కు అనుగుణంగా ఆయన తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంఖర్‌కు అందజేశారు.
శుక్రవారం, విజయ సాయి రెడ్డి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు బహిరంగంగా ప్రకటించారు.ఈ ప్రకటనకు అనంతరం శనివారం రాజ్యసభ ఛైర్మన్‌కు తన రాజీనామాను సమర్పించారు.
విజయ సాయి రెడ్డి 2016లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మొదటిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2022లో, వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆయనను మరో పదవీకాలానికి తిరిగి నామినేట్ చేశారు.
ఇది 2028 వరకు కొనసాగనుంది. అయితే, విజయ సాయి రెడ్డి తన పదవీకాలం ముగియడానికి మూడు సంవత్సరాల ముందుగానే రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు.