ఢిల్లీ మెట్రోలోని బ్లూ లైన్ రైలులో ఓ యువ జంట ముద్దుల్లో మునిగిపోయింది. తమను నలుగురు చూస్తున్నారన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వారు ముద్దులు పెట్టుకుంటూ అసభ్యంగా ప్రవర్తించారు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో ఇపుడు వైరల్ అయింది.
ఈ వీడియోలో వారు ఉద్వేగభరితమైన ముద్దులలో నిమగ్నమైనప్పుడు అమ్మాయి అబ్బాయి ఒడిలో పడుకునివుండటాన్ని చూడొచ్చు. ఇలా బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇతర ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు. కాగా, ఢిల్లీ మెట్రో రైళ్లలో వివాదాస్పద ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. గత కొన్ని నెలలుగా, రైలులో ఒక యువకుడు మ*సంగాడు క్లిప్‌తో సహా అనేక ఇతర సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.