Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళనాడులో ప్రైవేట్ బస్సుల రేస్‌లు... ప్రయాణికుల ప్రాణాలు గాల్లో.... (Video)

సాధారణంగా కార్, బైకు రైసులు నిర్వహించడం మనం చూస్తుంటాం. వింటుంటాం. కానీ, బస్సుల రేస్‌ను జరిగినట్టు ఎపుడూ వినలేదు. కానీ, తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో సోమవారం బస్సుల రేస్‌లు జరిగాయి. రెండు

Advertiesment
private buses race
, సోమవారం, 1 మే 2017 (14:36 IST)
సాధారణంగా కార్, బైకు రైసులు నిర్వహించడం మనం చూస్తుంటాం. వింటుంటాం. కానీ, బస్సుల రేస్‌ను జరిగినట్టు ఎపుడూ వినలేదు. కానీ, తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో సోమవారం బస్సుల రేస్‌లు జరిగాయి. రెండు ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు ఓవర్ టేక్ పేరుతో ఈ రేస్‌లు నిర్వహించారు. బస్సులో ఉన్న ప్రయాణికుల ప్రాణాలను గాల్లోకి వదిలిపెట్టి, ఓవర్ టేక్ చేయాలన్న ఏకైక లక్ష్యంతో.. రోడ్డు పనులు జరుగుతున్నా.. రోడ్డులో ఇతర వాహనాలు వస్తున్నా పట్టించుకోకుండా ఈ రేసింగ్‌లు నిర్వహించారు. అయితే, వెనుక వాహనాల్లో వస్తున్న వారిలో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే.. ఈ వీడియో వైరల్‌గా మారడంతో అధికారులు స్పందించి ఆ ఇద్దరు డ్రైవర్ల లైసెన్సులను రద్దు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కోయంబత్తూరు - పొల్లాచ్చి హైవేపై జరిగిన ఈ ఘటనలో ప్రయాణికుల ప్రాణాలను గాల్లో పెట్టినట్టు, అన్ని రకాల సేఫ్టీ నిబంధనలనూ ఉల్లంఘించి, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వేగంగా వెళుతూ, లైన్లు మారడం, రాంగ్ సైడ్‌లోనూ 80 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం, ఎదురుగా వస్తున్న వాహనాలను భయభ్రాంతులకు గురిచేయడం కనిపిస్తున్నాయి.
 
నిజానికి ఓ బస్సు మరో బస్సును క్రాస్‌ చేసేందుకు ప్రయత్నించగా ఆ బస్సు డ్రైవర్‌ పక్కకు తొలగలేదు. దీంతో ఏకంగా క్రాస్‌ చేయాలనుకున్న మరో బస్సు డ్రైవర్‌ అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లాడు. ఆ రోడ్డు ఇంకా నిర్మాణ దశలోనే ఉండటంతో దుమ్మురేగిపోయింది. 
 
ఇలా ఒకరిని ఒకరిని ఒకరు క్రాస్‌ చేస్తూ బైకు రేసు మాదిరిగా గాల్లో తేలిపోయే వేగంతో దూసుకెళుతుంటూ ఎదురుగా వచ్చే వాహనాలకు, పక్కన వెళ్లే వారికి గుండె ఆగినంతపనైంది. ఇద్దరు డ్రైవర్ల మధ్యా నెలకొన్న పోటీతో ప్రయాణికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది. 
 
అయితే, వాటి వెనుకాలే వస్తున్న ఓ బైకిస్టు ఈ వీడియోను తీసి సోషల్‌ మీడియాలో పెట్టగా పెద్ద సంచలనమైంది. ఆ బస్సు డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేశారు. మరోసారి ఇలాంటి బస్సులను నడిపిస్తే పర్మిట్‌ రద్దు చేస్తామంటూ బస్సు యజమానులను సంబంధిత అధికారులు హెచ్చరించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవ్వులు పూయించిన మాజీ మంత్రి స్పీచ్... లోకేష్‌లా 'పప్పు'లా జగన్ తయారు కాగలరా?