Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లాక్‌డౌన్‌తోనే కరోనా వైరస్‌కు విముక్తి : ఉపరాష్ట్రపతి వెంకయ్య

లాక్‌డౌన్‌తోనే కరోనా వైరస్‌కు విముక్తి : ఉపరాష్ట్రపతి వెంకయ్య
, మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (14:14 IST)
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే ఏకైక మార్గం లాక్‌డౌన్ మినహా మరొకటి లేని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. ఇది మళ్లీ పొడగిస్తారా లేదా అనే అంశంపై కేంద్రం ఓ స్పష్టతనివ్వలేదు.
 
ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. కరోనాను ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్‌ తప్ప మరో మార్గం లేదన్నారు. ఒకవేళ ఏప్రిల్‌ 14 తర్వాత లాక్‌డౌన్‌ పొడిగించాల్సి వచ్చినప్పటికీ ప్రజలు సంయమనంతో ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. 
 
రేపటి మంచి రోజుకోసం మరికొంతకాలం ఈ కష్టాలను భరిద్దాం అని అన్నారు. వచ్చేవారం చాలా కఠినమైనదని, లాక్‌డౌన్ ఎత్తివేయాలా కొనసాగించాలా అన్నది వచ్చే వారం రోజుల్లోనే నిర్ణయమవుతుందని అభిప్రాయపడ్డారు. 
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు క‌రోనా బాధితుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర హైకోర్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కోర్టుల్లో లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వ‌ర‌కు పొడ‌గిస్తున్న‌ట్లు నిర్ణ‌యించింది. 
 
వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఫుల్ కోర్టు స‌మావేశం నిర్వ‌హించిన ఉన్న‌త న్యాయ‌స్థానం.. ఈ నెల 25న‌ మ‌రోసారి ఫుల్ కోర్టు స‌మావేశం నిర్వ‌హించి స‌మీక్షించాల‌ని నిర్ణ‌యించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైడ్రాక్సీ క్లోరోక్విన్, పారాసిటమాల్‌పై ట్రంప్ కామెంట్స్.. ఘాటుగా బదులిచ్చిన భారత్