Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వామ్మో కూరగాయలు కాదు.. విషపదార్థాలు....

వామ్మో కూరగాయలు కాదు.. విషపదార్థాలు....
, శుక్రవారం, 26 జులై 2019 (17:35 IST)
శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లను కాయకూరల ద్వారా పొందుతుంటాం. అయితే, ఈ కూరగాయల్లోనూ విషపదార్థాలు ఉన్నాయనే దిగ్భ్రాంతికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. నిజానికి కాయకూరల్లో విటమిన్లు, ప్రోటీన్లు వంటి పోషక పదార్థాలు ఉంటాయి. కానీ, దేశ రాజధాని ఢిల్లీలోని మార్కెట్‌లలో విక్రయించే కూరగాయల్లో మాత్రం విష పదార్థాలు ఉన్నట్టు తేలింది. ఈ మేరకు నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్స్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు చేసిన ఓ పరిశోధనలో తేలింది. 
 
ప్రధానంగా యమునా నది పరీవాహకన ప్రాంతాల్లో పండిస్తున్న కూరగాయల్లో అధిక మోతాదులో లెడ్ (సీసం) పరిమాణం ఉందని పరిశోధకులు తెల్చారు. ఇలాంటి కూరగాయలను దీర్ఘకాలం పాటు తీసుకోవడం వల్ల కేన్సర్‌తో పాటు.. శరీరంలోని అంతర్గత అవయవాలైన మూత్రపిండాలు, కిడ్నీలు, ఊపిరిత్తితులు దెబ్బతింటాయని, అలాగే మెదడు సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని వారు తేల్చారు. చిన్నపిల్లల్లో అయితే, లేత వయసులోనే మానసిక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్నారు. 
 
ఢిల్లీ మార్కెట్‌లలో లభించే కూరగాయల్లో ప్రధానంగా కొత్తిమీర, పాలకూరలతో పాటు మరికొన్నింటిలో స్థాయికి మించి లెడ్ ఉందని వెల్లడించారు. అలాగే, కూరగాయల్లో లెడ్‌ పరిమాణం ఒక కిలోకి 2.5మి.గ్రా ఉండాల్సి ఉండగా.. అక్కడ మాత్రం 2.8మి.గ్రా నుంచి గరిష్టంగా 13.8మి.గ్రా వరకు ఉందని తెలిపారు. లెడ్‌ మినహా నికెల్‌, క్యాడ్మియం, మెర్‌క్యురీ మాత్రం సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. బ్యాటరీలు, పెయింట్‌, పాలిథీన్‌, ఆటోమొబైల్‌ విడిభాగాల తయారీ వంటి పరిశ్రమల నుంచి విడుదల్యేయ వ్యర్థజలాలు యమునా నదిలో కలవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తివుండొచ్చని వారు అభిప్రాయపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆజం ఖాన్ తల తెగనరికి పార్లమెంట్ ద్వారానికి వేలాడదీయండి...