Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వకుళ మాత దేవాలయాన్ని అద్భుతంగా నిర్మించాలి... గజల్ శ్రీనివాస్

వకుళమాత దేవాలయ నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, న్యాయ వ్యవస్థపై తమకున్న సంపూర్ణ విశ్వాసం వమ్ము కాలేదని, న్యాయమూర్తుల తీర్పును అభినందిస్తున్నామని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ (GHHF) & సేవ్ టెంపుల్స్.ఆర్గ్ వ్యవస్థాపకులు వెలగపూ

Advertiesment
Vakula Matha temple
, గురువారం, 17 నవంబరు 2016 (13:43 IST)
వకుళమాత దేవాలయ నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, న్యాయ వ్యవస్థపై తమకున్న సంపూర్ణ విశ్వాసం వమ్ము కాలేదని, న్యాయమూర్తుల తీర్పును అభినందిస్తున్నామని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ (GHHF) & సేవ్ టెంపుల్స్.ఆర్గ్ వ్యవస్థాపకులు వెలగపూడి ప్రకాశరావు, సేవ్ టెంపుల్స్ ప్రచారకర్త డా. గజల్ శ్రీనివాస్ ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు.
 
కోట్లాది మంది భక్తులు, ప్రతి భారతీయుడు ఆనందించదగ్గ కోర్టు నిర్ణయం వెలువడిందని, దీనికి కృషి చేసిన కాకినాడ శ్రీ పీఠం అధిపతి శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామిజి వారికి, మీడియా మిత్రులకు డా. గజల్ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేసారు. తిరుమల తిరుపతి దేవస్థానం శీఘ్రమే వకుళమాత దేవాలయ నిర్మాణం చేపట్టాలని, వకుళమాత ఆలయంతో పాటు ఆ పరిసర ప్రాంతంలో వకుళమాత ఆశ్రమాన్ని కూడా నిర్మించాలని కోరారు. అవసరమైతే సేవ్ టెంపుల్స్ ద్వారా ప్రవాస భారతీయుల నుండి నిధులు సేకరించి వకుళమాత ఆలయ నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ తీర్పు పురాతన దేవాలయాల జీవనోద్దరణకు స్ఫూర్తిదాయకమని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్ళిళ్ళకు వెళ్తే.. పాతనోట్లు, చెక్‌లే గిఫ్టులు.. కానుకల్లేవ్.. కొత్త నోట్లు అస్సల్లేవ్..