తనపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకు పత్రికలపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం లోక్‌సభ స్పీకర్‌తో పాటు సభా హక్కుల కమిటీకి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అఖిలపక్ష సమావేశంలో తనకు క్లాస్ తీసుకున్నారని దురుద్దేశ పూర్వకంగా కథనాలు రాసిన రిపోర్టర్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
జర్నలిజం ఎథిక్స్ ప్రకారం కనీసం తనని సంప్రదించకుండానే ఇష్టం వచ్చినట్లు కథనాన్ని ప్రచురించారన్నారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా తప్పుడు సమాచారం ప్రచురించినందుకు సదరు పత్రిక రిపోర్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు విజయసాయి రెడ్డి వెల్లడించారు.
అలాగే వారికి సంబంధించిన పార్లమెంట్లు ఎంట్రీ పాసులు రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు.
ఇటువంటి తప్పుడు కథనాలు ప్రచురించడం వల్ల ఎంపీగా తనకే కాకుండా పార్లమెంటు వ్యవస్థను సైతం అవమానపరిచారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.