Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తండ్రి ములాయంను గజగజలాడిస్తున్న అఖిలేష్ యాదవ్... అంతపనీ చేసేశాడా?

రాజకీయాల్లో... ముఖ్యంగా పదవి రుచి మరిగినవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ అవ్వరని ఎన్నో సంఘటనలు తెలిపాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. గత కొన్ని రోజులుగా తండ్రి ములాయం సింగ్ వర్సెస్ కుమారుడు అఖిలేష్ యాదవ్ మధ్య వి

Advertiesment
UttarPradesh political Heat
, శుక్రవారం, 6 జనవరి 2017 (19:21 IST)
రాజకీయాల్లో... ముఖ్యంగా పదవి రుచి మరిగినవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ అవ్వరని ఎన్నో సంఘటనలు తెలిపాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. గత కొన్ని రోజులుగా తండ్రి ములాయం సింగ్ వర్సెస్ కుమారుడు అఖిలేష్ యాదవ్ మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్లాయి. దీంతో ఇద్దరిమధ్య సయోధ్య కోసం ప్రయత్నాలు జరుగుతున్నా ఫలించడంలేదు. అఖిలేష్ యాదవ్ అన్నిటిలోనూ తన మాటే చెల్లుబాటు కావాలని మంకు పట్టుబడుతుండటంతో పరిస్థితి కొలిక్కి రావడంలేదు. 
 
మరోవైపు పార్టీకి సంబంధించిన నిధులు ములాయం సింగ్ యాదవ్ చేతికి అందకుండా చేసే పనిలో అఖిలేష్ ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ నిధులు సుమారు రూ.500 కోట్లు ఆయా బ్యాంకుల్లో ఉన్నాయి. వాటిని తమ అనుమతి లేకుండా విడుదల చేయవద్దనీ, స్తంభింపజేయాలని అఖిలేష్ చెప్పినట్లు తెలుస్తోంది. దీనితో బ్యాంకులు కూడా అఖిలేష్ మాటలను అనుసరించినట్లు సమాచారం. దీనితో ములాయం సింగ్ యాదవ్ గజగజ వణికిపోతున్నట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శవయాత్రలో 50 మంది అమ్మాయిలు బికినీలతో డ్యాన్స్... ఎందుకంటే?