ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 5.58 గంటలకు జోషిమఠ్‌లో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.6గా నమోదు అయ్యింది. జోషిమఠ్‌కు 31 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిపల్‌కోటి వద్ద భూకంప కేంద్రం ఉందని పేర్కొంది.
భూకంప ప్రభావంతో జోషిమఠ్‌లో భవనాలు స్వల్పంగా కంపించాయి. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా.. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు.