Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైతు నుంచి 5 కేజీల బంగాళాదుంపలు లంచంగా తీసుకున్న ఎస్ఐ.. సస్పెండ్

sweet potato

ఠాగూర్

, ఆదివారం, 11 ఆగస్టు 2024 (09:36 IST)
పోలీసులు ప్రభుత్వం ఖజానా నుంచి నెలవారీ జీతాలు తీసుకుంటున్నప్పటికీ లంచాలు తీసుకోవడం మాత్రం మానడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ కానిస్టేబుల్ ఓ రైతు నుంచి 5కేజీల బంగాళాదుంపలను లంచంగా తీసుకున్నాడు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అతడిపై సస్పెన్షన్ వేటు పడింది. 
 
అయితే ఓ కేసు సెటిల్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన అతడు.. కోడ్ పదంగా 'బంగాళదుంప'ను ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రామ్ కృపాల్ సింగ్ అనే ఎస్ఐ ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. ఎస్ఐ ఫోన్ కాల్‌ను రైతు రికార్డు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఎస్ఐ ఆడియో వైరల్‌గా మారింది.
 
కన్నౌజ్ జిల్లా సౌరిఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భావల్పూర్ చౌకీలో అతడు విధులు నిర్వహిస్తూ ఈ నిర్వాకానికి పాల్పడ్డాడని, దీంతో అతడిని కన్నౌజ్ ఎస్పీ అమిత్ కుమార్ ఆనంద్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో సదరు ఎస్ఐపై శాఖాపరమైన దర్యాప్తు చేపట్టాలని ఆదేశించినట్టు వెల్లడించారు. కన్నౌజ్ సిటీ సర్కిల్ అధికారి కమలేశ్ కుమార్కు కేసు దర్యాప్తు బాధ్యతలను అప్పగించారు.
 
కాగా వైరల్ ఆడియోలో ఆ ఎస్ఐ బాధిత రైతుని 5 కిలోల బంగాళాదుంపలు అడగగా.. తాను అన్ని ఇవ్వలేనని రైతు సమాధానం ఇచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఎస్ఐ తన ఉద్దేశాన్ని అర్థమయ్యేలా చెప్పాడు. ఆ రైతు 2 కిలోలు ఇస్తానని అన్నాడు. పోలీసు అధికారి కోపం తెచ్చుకుని తన అసలు డిమాండ్‌ను నొక్కి చెప్పాడు. దీంతో ఫైనల్‌గా 3 కిలోలు తీసుకునేందుకు ఎస్ఐ అంగీకరించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఎస్ఐ సస్పెండ్‌కు గురయ్యాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేవలం రూ.91కే బీఎస్ఎన్ఎల్ ప్లాన్... కానీ...