Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉత్తరప్రదేశ్‌లో ఓ బాలుడు ఆరేళ్ల క్రితం అదృశ్యమై.. అస్థిపంజరంగా కనిపించాడు..

Advertiesment
Uttar Pradesh
ఉత్తరప్రదేశ్‌లో ఓ బాలుడు ఆరేళ్ల క్రితం అదృశ్యమై.. అస్థిపంజరంగా కనిపించాడు. ఆరేళ్లుగా అతని అంతుచిక్కకుండా అతని కుటుంబం ఆందోళన వ్యక్తం చేసింది. అదృశ్యమైన తమ బిడ్డ ఎక్కడో ప్రాణాలతో వుంటాడనుకున్న అతని తల్లిదండ్రులకు చివరికి గుండె పగిలే వార్త వచ్చింది. 2020లో ఇంటి పెరట్లో ఆడుకుంటూ మాయమైన ఏడేళ్ల ప్రిన్స్ అలియాస్ టిల్లూ, సొంత బంధువుల చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడని పోలీసులు తేల్చారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో బాలుడి అస్థిపంజరాన్ని పోలీసులు వెలికితీశారు.
 
2020 ఆగస్టు 16న ప్రిన్స్ తన ఇంటి పెరట్లో ఆడుకుంటూ అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. 
 
ఇటీవల ఈ కేసులో తిరిగి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. కుటుంబ, ఆస్తి తగాదాల కారణంగానే బాలుడిని బంధువులు గొంతు నులిమి హత్య చేసి, మృతదేహాన్ని సమీపంలోని ఎక్స్‌ప్రెస్‌వే పక్కన గొయ్యి తీసి పూడ్చిపెట్టినట్లు నిందితులు నేరాన్ని అంగీకరించారు.
 
నిందితులు చూపిన ప్రదేశంలో తవ్వకాలు జరపగా, బాలుడి అస్థిపంజరం, కొన్ని బట్టలు లభ్యమయ్యాయి. ప్రస్తుతం నిందితులు పోలీస్ కస్టడీలో ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సభ్యత్వ డ్రైవ్‌‌లో జనసేన అదుర్స్.. ఒకే రోజులో లక్షకు పైగా కొత్త సభ్యులు