Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాత్రూంలో రక్తపు మరకలు... 70 మంది విద్యార్థినులను నగ్నంగా నిలబెట్టి చూసింది...

ఈమధ్య పాఠశాలల్లో దారుణాలు మరీ పెరిగిపోతున్నాయి. విద్యార్థినీవిద్యార్థుల పట్ల ఎలా మసలుకోవాలన్న విచక్షణ చాలామందికి లోపిస్తున్నట్లు అగుపిస్తోంది. ఇదివరకు టీచర్ ట్రెయినింగ్ అంటూ ఇచ్చేవారు. ఇక పాఠశాలల్లో పనిచేసే ఆయాలు, వార్డెన్లకు కూడా పిల్లల విషయంలో ఎలా

బాత్రూంలో రక్తపు మరకలు... 70 మంది విద్యార్థినులను నగ్నంగా నిలబెట్టి చూసింది...
, శుక్రవారం, 31 మార్చి 2017 (16:20 IST)
ఈమధ్య పాఠశాలల్లో దారుణాలు మరీ పెరిగిపోతున్నాయి. విద్యార్థినీవిద్యార్థుల పట్ల ఎలా మసలుకోవాలన్న విచక్షణ చాలామందికి లోపిస్తున్నట్లు అగుపిస్తోంది. ఇదివరకు టీచర్ ట్రెయినింగ్ అంటూ ఇచ్చేవారు. ఇక పాఠశాలల్లో పనిచేసే ఆయాలు, వార్డెన్లకు కూడా పిల్లల విషయంలో ఎలా మసలుకోవాలన్నదానిపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేవారు. ఇపుడలాంటివి వున్నా... ఏదో మొక్కుబడిగా సాగిపోతున్నట్లు తెలుస్తోంది. అందువలనే పిల్లలపై మానసిక, భౌతిక దాడులు ఎక్కువవుతున్నాయనిపిస్తోంది. తాజాగా ఓ వార్డెన్ చేసిన అకృత్యం సమాజం తల దించుకునేట్లుగా వుంది. 
 
వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ స్కూలులో ఓ వార్డెన్ 70 మంది విద్యార్థునులను నగ్నంగా నిలబెట్టింది. దీనికి ఆమె చెప్పే కారణమేమిటంటే... హాస్టల్ బాత్రూమ్‌లో ఓ చోట ఆమెకు రక్తం మరకలు కన్పించాయట. దాంతో ఏ అమ్మాయికో ఇబ్బంది వుందని గ్రహించాననీ, అలా ఇబ్బందిపడే అమ్మాయి ఎవరో చెప్పమని అడిగితే ఎవ్వరూ చెప్పలేదట. దాంతో ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టేందుకు ఇలా అందరి చేత దుస్తులు విప్పించేశానని సర్ది చెప్పుకుంది. 
 
వార్డెన్‌గా తన బాధ్యతను తను నిర్వహించాననీ, తన ఆధ్వర్యంలో ఏ అమ్మాయికైనా అనారోగ్యం వల్ల సమస్య ఎదురయితే బాధ్యత తనే వహించాలి కనుక తన డ్యూటీ తను చేసినట్లు చెప్పింది. ఇలా వరుసబెట్టి దుస్తులు విప్పించడం బాధ్యతగా ఆమె భావించడం విడ్డూరమే. ఈ ఘటనపై పూర్తి వివరాలను సేకరించేందుకు రంగంలోకి దిగారు అధికారులు. మరోవైపు యాజమాన్యం ఆ మహిళా వార్డెన్‌ను పదవి నుంచి తొలగించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న్యాయమూర్తులపై కర్ణన్ సెన్సేషనల్ కామెంట్స్: సుప్రీం సీరియస్.. ఆయన మానసిక పరిస్థితి ?