Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెత్తే కదా అని తీసిపారేయకండి.. దానిలో కూడా శక్తి ఉంది.

Advertiesment
Waste
, గురువారం, 7 మార్చి 2019 (15:19 IST)
భారతదేశంలో విచ్చలవిడిగా చెత్త, వ్యర్థ పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. ప్రభుత్వాలు ఎన్నో అవగాహన కార్యక్రమాలను చేపట్టినా కొంత మంది ఎప్పుడూ వాటిని సరిగా పాటించరు. అయితే మనం వ్యర్థం అని పడేసే చెత్త నుండి కరెంటును ఉత్పత్తి చేస్తారని మీకు తెలుసా? చెత్తతో కరెంటు ఉత్పత్తి చేయడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? 
 
చెత్త అంటే పనికిరాని వస్తువుల సముదాయం. చెత్తతో సైతం మనకు బోలెడన్ని ఉపయోగాలు ఉన్నాయనే విషయం ఇప్పుడు అర్థమవుతోంది. ఈ మధ్య కాలంలో అన్ని దేశాల్లో ఘనవ్యర్థ పదార్థాల కార్యకలాపం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఇంటిలో మిగిలిపోయిన ఆహారపదార్థాలు కుళ్లిపోవడం వల్ల కానీ, మనం పారేసిన చెత్త పదార్థాలలో ఎంతో కొంత శక్తి దాగి ఉంటుంది. 
 
కనుక వాటన్నింటినీ సేంద్రియ రసాయనాలుగా తయారు చేసుకోవచ్చు. ఇంటిలో వ్యర్థంగా మిగిలిపోయిన కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు, ప్లాస్టిక్‌లు, పేపర్‌లు, ఆకులు, పాచీ వగైరా పదార్థాలను ఎండబెట్టి, వాటిని మండించడం ద్వారా విడుదలయ్యే ఉష్ణశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చవచ్చు. అంతేకాకుండా వ్యర్థ కాగితాల్ని తిరిగి నానబెట్టి గుజ్జుగా మార్చి కొత్త కాగితాన్ని తయారు చేయవచ్చు. ఇలా ఎన్నో వ్యర్థ పదార్థాలను తిరిగి పునర్వినియోగించుకునే సదుపాయం మన దేశంలో అనేక ప్రధాన నగరంలో ఉండడం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ర్యాష్ డ్రైవింగ్‌.. అడ్డొచ్చిన వాడిని రెండు కిలోమీటర్లు లాక్కెళ్లాడు..