సెల్ఫీ పిచ్చి బాగా ముదిరింది.. యాసిడ్ తాగిన మహిళతో పోలీసులు సెల్ఫీ
సెల్ఫీ పిచ్చి బాగా ముదిరింది. స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో సెల్ఫీలంటే ఎక్కువ ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు యాసిడ్ బాధితురాలు బెడ్‌పై విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే ఆమెకు సంరక్షణగా ఉండాల్
సెల్ఫీ పిచ్చి బాగా ముదిరింది. స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో సెల్ఫీలంటే ఎక్కువ ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు యాసిడ్ బాధితురాలు బెడ్‌పై విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే ఆమెకు సంరక్షణగా ఉండాల్సిన మహిళా పోలీసులు ఆమె బెడ్ పక్కనే కూర్చుని సెల్ఫీలు దిగారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కూతురి పరీక్షల కోసం లక్నో వెళ్లి తిరిగి రైల్లో వస్తున్న ఓ మహిళ(35) శనివారం సామూహిక అత్యాచారానికి గురైంది. గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఆమెతో కామాంధులు బలవంతంగా యాసిడ్ తాగించారు. ఈ ఘటన అనంతరం మాట్లాడలేని స్థితిలోకి వెళ్లిన బాధితురాలు లక్నో పోలీసులకు జరిగింది నోటితో చెప్పలేక లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. వెంటనే ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు, ఆమెను చికిత్స నిమిత్తం కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చేర్పించారు.
ఆమెకు సంరక్షణగా ముగ్గురు మహిళా పోలీసులను నియమించారు. అయితే సంరక్షణగా వచ్చిన ఈ మహిళా పోలీసులు బాధితురాలి బెడ్ పక్కనే కూర్చుని చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీలు తీసుకోవడం అందరినీ షాక్ గురిచేసింది. నెటిజన్లు ఈ ఘటనపై మండిపడుతున్నారు. యాసిడ్ దాడికి గురైన మహిళతో సెల్ఫీలు తీసిన పోలీసులను సస్పెండ్ అయ్యారు.