యూపీ పోల్స్ : ప్రశాంతంగా తొలి విడత పోలింగ్.. 73 సీట్లలో 664 మంది అభ్యర్థుల పోటీ
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లోభాగంగా తొలిదశ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. త్రిముఖ పోటీ నెలకొన్న ఈ రాష్ట్రంలో తొలి దశలో భాగంగా శనివారం 73 స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఎస
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లోభాగంగా తొలిదశ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. త్రిముఖ పోటీ నెలకొన్న ఈ రాష్ట్రంలో తొలి దశలో భాగంగా శనివారం 73 స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ ఒక కూటమిగా, భాజపా, బీఎస్పీలు విడివిడిగా పోటీ పడుతున్నాయి.
తొలిదశలో 2.57 కోట్ల మంది ఓటర్లు 664 అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల పోటీలో ఉన్న ప్రముఖులు
పంకజ్ సింగ్-నొయిడా (కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కుమారుడు), ప్రదీప్ మాధుర్-మథుర(సీఎల్పీ నేత), లక్ష్మీకాంత్ బాజ్‌పేయి-మేరఠ్(భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు), రాహుల్ సింగ్-సికందరాబాద్ (ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌యాదవ్ అల్లుడు), సందీప్ సింగ్-అత్రౌలి (రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్‌సింగ్ మనుమడు).
కాగా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లోని 73 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 9.00కి అలీగఢ్‌లో 10.5 శాతం, బులంధషహర్, ఆగ్రా, ఘజియాబాద్లో 12 శాతం, ఫిరోజాబాద్‌లో 11 శాతం, ముజఫర్‌నగర్‌లో 15 శాతం పోలింగ్ నమోదయ్యింది. కాగా, బీజేపీ, బీఎస్పీ, ఎస్పీ-కాంగ్రెస్ త్రిముఖ పోటీలో 839 అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.