Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే సీఎం ఎవరు.. రాజ్‌నాథ్ వర్సెస్ యోగి ఆదిత్యనాథ్... రామాలయం కోసమేనా?

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనవారం విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ విస్పష్ట ఫలితాలతో అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమని తేలిపోయింది. దీంతో యూపీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఇపు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే సీఎం ఎవరు.. రాజ్‌నాథ్ వర్సెస్ యోగి ఆదిత్యనాథ్... రామాలయం కోసమేనా?
, శనివారం, 11 మార్చి 2017 (12:02 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనవారం విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ విస్పష్ట ఫలితాలతో అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమని తేలిపోయింది. దీంతో యూపీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఇపుడు చర్చ ఆరంభమైంది. ప్రస్తుత ట్రెండ్ మేరకు బీజేపీకి 313 చోట్ల ఆధిక్యంలో ఉంది. 
 
ఈ రాష్ట్రంలో బీజేపీ 15 ఏళ్ళ తర్వాత రాష్ట్రంలో అధికారం చేపట్టబోతుంది. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ఎవరిని ఎంపిక చేస్తుందనే అంశం చర్చనీయాంశమైంది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, మనోజ్ సిన్హా, సంతోష్ గంగ్వార్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, ఎంపీ ఆదిత్యనాథ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. 
 
ప్రస్తుతం లక్నో ఎంపీగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి వరిస్తుందని అత్యధికులు భావిస్తున్నారు. ఆయన ప్రస్తుతం కేంద్ర హోం మంత్రిగా సమర్థవంతంగా పని చేస్తున్నారంటున్నారు. 2002 మార్చిలో ఆయన ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు వ్యవహరించారు. పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా 20 వేల కిలోమీటర్లు ప్రయాణించి, 26 రోజుల పాటు ప్రచారం చేశారు. 120 బహిరంగ సభల్లో ప్రసంగించారు. మరోవైపు ఆరెస్సెస్ అండదండలు కూడా ఆయనకు పుష్కలంగా ఉన్నాయి. 
 
అలాగే, కేంద్ర మంత్రులు మనోజ్ సిన్హా, స్మృతి ఇరానీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతోనూ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతోనూ వీరికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇకపోతే.. ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్యతోపాటు. బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ పేర్లూ వినిపిస్తున్నాయి.  
 
వీరితోపాటు.. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్ పేరు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థుల చర్చలో వినిపిస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన 2.4 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలిచి సంచలనం సృష్టించారు. ఆయనకు పరిపాలన దక్షత ఉందని చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్షర సత్యమైన అమిత్ షా జోస్యం... షాక్ తిన్న అఖిలేష్ యాదవ్...