Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్షర సత్యమైన అమిత్ షా జోస్యం... షాక్ తిన్న అఖిలేష్ యాదవ్...

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బంపర్ మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకోనుంది. మొత్తం 403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో బీజేపీ 308 చోట్ల స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.

Advertiesment
UP Assembly elections live updates
, శనివారం, 11 మార్చి 2017 (11:49 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బంపర్ మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకోనుంది. మొత్తం 403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో బీజేపీ 308 చోట్ల స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఫలితంగా యూపీ కోటపై కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని తేలిపోయింది. అయితే, ఈ ఎన్నికల ప్రచారంలోభాగంగా చివరి రోజున బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పిన జోస్యం అక్షర సత్యమయ్యాయి. 
 
ఈ ఎన్నికల్లో సీఎం అఖిలేశ్‌ యాదవ్‌కు ఓటమి తప్పదని, మార్చి 11న ఉదయం 11 గంటలకు ఫలితాలు వెలువడతాయని, మధ్యాహ్నం ఒంటిగంటకల్లా రాజీనామా సమర్పించేందుకు సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు. అమిత్‌షా మాటలు శనివారం వాస్తవరూపం దాల్చాయి. ఎన్నికల్లో ఓటమి పాలైన ఎస్పీ నేత, యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. 
 
అయితే అమిత్‌షా జోస్యం చెప్పినట్టు అఖిలేష్ మధ్యాహ్నం రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోరారు. రాష్ట్రంలో భాజపా తరఫున ప్రచారంలో కీలకపాత్ర పోషించిన అమిత్‌షా ప్రచారంలో అఖిలేశ్‌ పాలనపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ పాలనలో గూండాగిరి పెరిగిపోయిందని ఆరోపించారు. ప్రచారంతో పాటు అభ్యర్థుల ఎంపికలోను ప్రధాన పాత్ర పోషించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్ గాంధీతో పొత్తు పెట్టుకోవడమే మైనస్.. సమాజ్ వాదీని అదే కొంపముంచింది..