Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓవర్ కాన్ఫిడెన్సే ఇద్దరు మిత్రులను ముంచింది.. ఎవరా ఇద్దరు?

అతిగా ఆశపడే మగాడు.. అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలోనే లేదన్న సినిమా డైలాగ్ ఉంది. ఇది అప్పట్లో తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పిన డైలాగ్. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ డైలాగ్ అప్పట్లో ఫేమస్. అయితే

Advertiesment
UP Election Results 2017
, ఆదివారం, 12 మార్చి 2017 (10:31 IST)
అతిగా ఆశపడే మగాడు.. అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలోనే లేదన్న సినిమా డైలాగ్ ఉంది. ఇది అప్పట్లో తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పిన డైలాగ్. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ డైలాగ్ అప్పట్లో ఫేమస్. అయితే ఇలాంటి పరిస్థితే ప్రస్తుతం రాజకీయాల్లో ఇద్దరు మిత్రులకు ఎదురైంది. వారే రాహుల్ గాంధీ, అఖిలేష్‌ యాదవ్.
 
రాజకీయాల్లో శాశ్వత శత్రువు, శాశ్వత మిత్రులు ఉండరని వీరిని చూసిన తర్వాత చాలామంది రాజకీయ నాయకులే చెప్పారు. సరిగ్గా ఎన్నికలకు ముందు ప్రధానిమంత్రి నరేంద్ర మోడీ హవాను తగ్గించి తామే పీఠం ఎక్కాలని అత్యాశతో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ లు ఇద్దరూ కలిశారు. తండ్రి ములాసింగ్ యాదవ్ వద్దన్నా, తల్లి సోనియాగాంధీ బుజ్జగించినా అటు అఖిలేష్‌ యాదవ్ గానీ, ఇటు రాహుల్ గాంధీ గానీ మాట వినలేదు. 
 
మేమిద్దరం కలిస్తే ఖచ్చితంగా విజయం ఖాయమన్న అతి నమ్మకంతో ఉన్నారు ఇద్దరు మిత్రులు. ఆ ఓవర్ కాన్పిడెన్సే ఇప్పుడు వారి కొంప ముంచింది. భారీ ఓటమిని ఇద్దరూ కలిసి చవిచూడాల్సి వచ్చింది. ఇద్దరిని కోలుకోలేని దెబ్బ తీసింది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణమైంది. ఇప్పుడు ఇద్దరు మిత్రులు చెరోపక్క బాధపడుతూ కూర్చున్నారు. రెండు పార్టీలపైన ప్రజలకున్న వ్యతిరేకతే వారిని ఘోరంగా ఓడించిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల వెంకన్న బంగారు ఏ బ్యాంకులో.. ఎంత జమచేశారో తెలుసా...!